Aha OTT: ఒకే ఓటీటీలో రాజీవ్ కనకాల వెబ్‌సిరీస్ - సుమ సెలిబ్రిటీ షో - డీటెయిల్స్ రివీల్!
Aha OTT: రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో హోమ్టౌన్ పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఆహా ఓటీటీలో త్వరలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో సుమ కనకాల సెలిబ్రిటీ కుకరీ షో చేయబోతున్నది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 4కు సుమ హోస్ట్‌గా వ్యవహరించనుంది.

మరో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హౌమ్టౌన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్‌సిరీస్‌లో సీనియర్ యాక్టర్లు రాజీవ్ కనకాల, ఝాన్సీ తో పాటు ప్రజ్వల్ యాద్మా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు.
మధ్య తరగతి అనుబంధాలతో...
మధ్య తరగతి కుటుంబం అనుబంధాలు అప్యాయతలకు ప్రాముఖ్యతనిస్తూ హోమ్టౌన్ వెబ్‌సిరీస్ రూపొందుతోన్నట్లు సమాచారం. హౌమ్టౌన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్‌చేస్తామని ఆహా ఓటీటీ ప్రకటించింది. మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీతో పాటు ప్రజ్వల్ యాద్మా కాంబినేషన్లో వచ్చే సీన్స్ హౌమ్టౌన్ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతోన్నారు.
సుమ ఓటీటీ షో...
ఆహా ఓటీటీలోనే రాజీవ్ కనకాల భార్య, టాప్ తెలుగు యాంకర్ సుమ...రియాలిటీ షో చేయబోతున్నది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 4కు సుమ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ కుకరీ షోకు సినిమా టీవీ యాక్టర్స్‌తో పాటు సోషల్ మీడియా సెలిబ్రిటీలు గెస్ట్లుగా రానున్నారు.
చిరంజీవ మూవీ...
హౌమ్టౌన్ వెబ్‌సిరీస్‌తో పాటు రాజ్ తరుణ్ చిరంజీవ మూవీపై ఆహా ఓటీటీ క్లారిటీ ఇచ్చింది. చిరంజీవ వెబ్‌సిరీస్ అంటూ ప్రచారం జరిగింది. వెబ్‌సిరీస్ కాదు మూవీ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. మైథలాజికల్ జోనర్లో తెరకెక్కుతోన్న ఆహా ఒరిజినల్ మూవీలో రాజ్‌తరుణ్‌కు జోడీగా కుషిత కల్లపు హీరోయిన్గా నటిస్తోంది. చిరంజీవ మూవీకి జబర్ధస్థ్ కమెడియన్ అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతోనే దర్శకుడిగా అతడు మారుతున్నాడు. మార్చి నెలలోనే చిరంజీవ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
సత్యభామ మూవీలో...
హౌమ్ టౌన్ కంటే ముందు తెలుగులో కాజల్ సత్యభామ సినిమాలో ప్రజ్వల్ యాద్మా ఓ కీలక పాత్రలో కనిపించాడు. అలిపిరికి అల్లంత దూరంలో మూవీలో నటించాడు. ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాడు రాజీవ్ కనకాల. ఇటీవల రిలీజైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బ్రహ్మా ఆనందం సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాడు.
సంబంధిత కథనం