చాయ్ వాలాగా రాజీవ్ కనకాల.. ఆకట్టుకునేలా టీజర్.. కల్కీ స్టోరీ రాస్తే పాసైపోతామంటూ!-rajeev kanakala chai wala teaser released producer raj kandukuri comments in teaser launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  చాయ్ వాలాగా రాజీవ్ కనకాల.. ఆకట్టుకునేలా టీజర్.. కల్కీ స్టోరీ రాస్తే పాసైపోతామంటూ!

చాయ్ వాలాగా రాజీవ్ కనకాల.. ఆకట్టుకునేలా టీజర్.. కల్కీ స్టోరీ రాస్తే పాసైపోతామంటూ!

Sanjiv Kumar HT Telugu

నటుడు రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించిన సినిమా చాయ్ వాలా. లవ్ రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చాయ్ వాలా సినిమాలో హీరోగా శివ కందుకూరి చేశాడు. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించిన చాయ్ వాలా టీజర్‌ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో చాయ్ వాలా టీజర్ ఆకట్టుకుంటోంది.

చాయ్ వాలాగా రాజీవ్ కనకాల.. ఆకట్టుకునేలా టీజర్.. కల్కీ స్టోరీ రాస్తే పాసైపోతామంటూ!

యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చాయ్ వాలా’. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు. చాయ్ వాలా సినిమాకు ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు.

చాయ్ వాలా టీజర్

ఇటీవల రిలీజ్ చేసిన చాయ్ వాలా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా బుధవారం (ఆగస్ట్ 20) నాడు చాయ్ వాలా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ, ఎమోషన్స్‌తో చాయ్ వాలా టీజర్ ఆకట్టుకుంటోంది.

‘నా చాయ్ విలువ రూ. 15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ అద్భుతంగా ఆరంభమైంది. ‘ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం కదరా’ అంటూ శివ కందుకూరి చెప్పిన డైలాగ్ కామెడీగా ఉంది.

తండ్రీకొడుకుల మధ్య సీన్లు

ఆ తరువాత తండ్రీ కొడుకుల మధ్య సీన్లు, లవ్ స్టోరీకి సంబంధించిన ట్రాక్ ఇలా అన్నింటిని చూస్తే ‘చాయ్ వాలా’ యూత్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అంశాలను జోడించినట్టుగా అనిపిస్తుంది. ఇక చాయ్ వాలా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత రాజ్ కందుకూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. "చాయ్ వాలా టైటిల్‌ను నిర్మాత వెంకట్ గారే నిర్ణయించారు. అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. కథను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను చేశారు. థియేటర్లోనే వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్లేలా ఉండే చిత్రాలు హిట్ అవుతాయి. ‘చాయ్ వాలా’ చిత్రాన్ని చూసిన తరువాత ఎమోషన్‌తో బయటకు వెళ్తారు" అని అన్నారు.

ఇమ్రాన్ రైటింగ్ అద్భుతంగా

"రాజీవ్ కనకాల గారు గొప్ప యాక్టర్. రెండేళ్ల క్రితం కథ చెప్పినప్పుడే రాజీవ్ కనకాల గారు తండ్రి పాత్రను పోషిస్తారని డైరెక్టర్ ప్రమోద్ చెప్పారు. ఇమ్రాన్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తేజు అశ్వినికి తెలుగులో చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ప్రమోద్ రాసిన మంచి కథకు, మంచి నటీనటులు కలిసి వచ్చారు" అని రాజ్ కందుకూరి తెలిపారు.

"శివకు సురేష్ బనిసెట్టి మంచి పాటల్ని రాస్తుంటారు. శివ స్నేహితుడిగా ఇందులో కసిరెడ్డి చాలా చక్కగా నటించారు. క్రాంతి గారు చక్కటి విజువల్స్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది" అని రాజ్ కందుకూరి వెల్లడించారు.

మంచి దర్శకుడిగా

"ప్రమోద్ హర్ష అనే వ్యక్తి మంచి దర్శకుడిగా నిలబడతారు.. శివకు మంచి పేరు వస్తుంది.. నిర్మాత వెంకట్ గారు ఇలాంటి మంచి చిత్రాలెన్నో నిర్మించాలి. ‘చాయ్ వాలా’ చిత్రం ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని హీరో తండ్రి రాజ్ కందుకూరి పేర్కొన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం