Rajayogam OTT Release Date: ఓటీటీలో నవ్వులు పూయించేందుకు సిద్ధమైన రాజయోగం.. ఎందు-rajayogam streaming on disney plus hotstar from 2023 february 9 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajayogam Streaming On Disney Plus Hotstar From 2023 February 9

Rajayogam OTT Release Date: ఓటీటీలో నవ్వులు పూయించేందుకు సిద్ధమైన రాజయోగం.. ఎందు

Maragani Govardhan HT Telugu
Feb 02, 2023 05:39 PM IST

Rajayogam OTT Release Date: సాయి రోణక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజయోగం. ఈ సినిమా డిసెంబరు 30న థియేటర్లలో విడుదల కాగా.. తాజాగా ఓటీటీలో రిలీజయ్యేందుకు సిద్ధమైంది. ఈ నెల 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

రాజయోగం ఓటీటీ విడుదల తేదీ
రాజయోగం ఓటీటీ విడుదల తేదీ

Rajayogam OTT Release Date: సాయి రోణక్, అంకిత సాహా, షకలక శంకర్, బిస్మీ నాస్, ప్రవీణ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన చిత్రం రాజయోగం. డిసెంబరు 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో వినోదం పండినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రాజయోగం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 9 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవీ నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ గణపతి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

కథ..

రిషి(సాయి రోణక్) అనే మధ్యతరగతి కుర్రావాడు మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. ఓ సారి తను రీపేర్ చేసిన కారును ఓనర్‌కు ఇచ్చేందుకు ఓ స్టార్ హోటల్‌కు వెళ్తాడు. అక్కడ అతడు శ్రీ(అంకిత)ని చూసి ఆమె ప్రేమలో పడతాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే శ్రీ కేవలం రిషి నుంచి శారీరక సుఖాన్ని మాత్రమే పొందుతూ వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్) గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. దీంతో రిషి ఎలాగైన.. ఆమె అసలు వ్యక్తిత్వాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రిషికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? డేనియల్ నుంచి రాధా వజ్రాలను దొంగిలించాడా? తదితర విషయాలు తెలియాలంటే రాజయోగం సినిమా చూడాల్సిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం