Rajamouli Wishes to Vinayak: బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఛత్రపతి బాగా సూటవుతుంది.. టీమ్‌కు రాజమౌళి విషెస్-rajamouli wishes to hindi chatrapathi team and vinayak ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli Wishes To Vinayak: బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఛత్రపతి బాగా సూటవుతుంది.. టీమ్‌కు రాజమౌళి విషెస్

Rajamouli Wishes to Vinayak: బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఛత్రపతి బాగా సూటవుతుంది.. టీమ్‌కు రాజమౌళి విషెస్

Rajamouli Wishes to Vinayak: దర్శక ధీరుడు రాజమౌళి.. హిందీ ఛత్రపతి బృందానికి విషెస్ తెలిపారు. ఓ వీడియో ద్వారా ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వీవీ వినాయక్‌ను అభినందించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో వినాయక్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్‌లో చేసిన సంగతి తెలిసిందే.

ఎస్ఎస్ రాజమౌళి (AFP)

Rajamouli Wishes to Vinayak: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్టియిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కెరీర్‌లేనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేశాడు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 12న విడుదల కాబోతుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ వివిధ ఛానల్స్‌లో ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌కు దర్శకుడు రాజమౌళి విషెస్ చెప్పారు. ఓ ప్రత్యేక వీడియో ద్వారా తమ స్పందనను తెలియజేశారు.

"ఛత్రపతి సినిమా నాకెప్పటికీ ప్రత్యేకమైన చిత్రమే. భారత చలనచిత్ర సీమలో ఉన్న మాస్ దర్శకుల్లో వీవీ వినాయక్ ఒకరు. ఆయన ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారని తెలిసి సంతోషించాను. బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ స్టోరీ బాగా సరిపోతుంది. అతడి బాడీ లాంగ్వేజ్‌కు సూటవుతుంది. చిత్రబృందం మొత్తానికి విషెస్ చెబుతున్నాను. ఈ చిత్రాన్ని మే 12న థియేటర్లలోనే చూడండి." అంటూ రాజమౌళి.. హిందీ ఛత్రపతి టీమ్‌కు విషెస్ తెలిపారు.

రాజమౌళి తమ టీమ్‌కు విషెస్ చెప్పడంతో బెల్లంకొండ శ్రీనివాస్ సహా ఛత్రపతి చిత్రబృందమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వినాయక్ కూడా మాట్లాడారు. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్.. హిందీలో పెద్ద స్టార్‌గా ఎదుగుతారని అన్నారు. ఇంతమంచి కథను అందించినందుకు రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ మూవీని జాగ్రత్తగా రీమేక్ చేసినట్లు పేర్కొన్నారు.

పెన్ ఇండియా లిమిటెడ్ పతాకంపై ఛత్రపతి రీమేక్‌ను జయంతిలాల్ గడ, ధవ్‌లాల్ గడ, అక్షయ్ గడ నిర్మించారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుష్రత్ భరుచా హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించగా.. తనిష్క్ బాగ్చీ పాటలకు స్వరాలను అందించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ.