Rajamouli: మహేష్‌బాబు పాస్‌పోర్ట్ లాగేసుకున్న రాజమౌళి - ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ షురూ!
Rajamouli: మహేష్‌బాబు, రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు పాస్‌పోర్ట్‌ను లాగేసుకొని అతడిని లాక్ చేసినట్లుగా ఓ వీడియోను రాజమౌళి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రాజమౌళి పోస్ట్‌కు మహేష్‌బాబు ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.
Rajamouli: మహేష్‌బాబు, రాజమౌళి కాంబోలో రానున్న సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? మహేష్ సెట్స్‌లో అడుగుపెట్టేది ఎప్పుడు? హీరోయిన్ ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికేది రోజు ఏడాది కాలంగా ఫ్యాన్స్ వెయిల్ చేస్తోన్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్యాన్స్‌కు రాజమౌళి గుడ్‌న్యూస్ వినిపించాడు.
సింహాన్ని బోనులో...
పాస్‌పోర్ట్ లాగేసుకొని సింహాన్ని బోనులో బందీస్తున్నట్లుగా ఓ వీడియోను శనివారం ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోకు క్యాప్షర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మహేష్‌బాబు పాస్‌పోర్ట్ లాగేసుకొని అతడిని తన సినిమా కోసం లాక్ చేసినట్లుగా ఈ వీడియో ద్వారా రాజమౌళి హింట్ ఇచ్చాడని అభిమానులు కామెంట్స్‌చేస్తోన్నారు. మహేష్‌బాబును సింహంతో పోల్చినట్లుగా చెబుతోన్నారు. రాజమౌళి సినిమా షూటింగ్ కారణంగా ఇక నుంచి మహేష్‌బాబు ఫారిన్ టూర్లకు వెళ్లడం కుదరదని అంటున్నారు. నాలుగైదేళ్ల పాటు మహేష్‌బాబును రాజమౌళి బందీని చేసేసాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతోన్నారు.
ఒక్కసారి కమిట్ అయితే....
రాజమౌళి వీడియోకు మహేష్‌బాబు చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రాజమౌళికి మహేష్‌బాబు రిప్లై ఇచ్చాడు. పోకిరి మూవీలోనే ఫేమస్ డైలాగ్ తో రిప్లై ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ కామెంట్ చేసింది.
అఫీషియల్‌గా....
రాజమౌళి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫీషియల్‌గా మూవీ సెట్స్‌లోకి మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా ఎంటర్ అయినట్లు ఈ వీడియో ద్వారా రాజమౌళి అభిమానులకు హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు సమాచారం. మహేష్‌బాబు, ప్రియాంక చోప్రాపై కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తోన్నట్లు చెబుతోంది. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నది మేకర్స్ గోప్యంగా ఉంచుతోన్నారు.
ఎస్ఎస్ఎంబీ 29 ...
మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 29వ సినిమా ఇది. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తోన్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ కథ సాగనున్నట్లు సమాచారం.
మహేష్ బాబు మేకోవర్...
రాజమౌళి సినిమా కోసం మహేష్‌బాబు స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. ఫిజిక్ పెంచడమే కాకుండా లుక్ విషయంలో మార్పులు చేశారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త లుక్‌లో ఈ సినిమాలో మహేష్‌బాబు కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తోన్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఆర్ఆర్ ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. అంతే కాకుండా మహేష్‌బాబు, రాజమౌళి కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.