Rajamouli Rashmi Video: రష్మితో రాజమౌళి.. వైరల్ అవుతున్న లవ్ ట్రాక్ వీడియో.. అవాక్కవుతున్న నెటిజన్లు-rajamoli and rashmi gautam old yuva tv serial video going viral on social media and netizens reacting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli Rashmi Video: రష్మితో రాజమౌళి.. వైరల్ అవుతున్న లవ్ ట్రాక్ వీడియో.. అవాక్కవుతున్న నెటిజన్లు

Rajamouli Rashmi Video: రష్మితో రాజమౌళి.. వైరల్ అవుతున్న లవ్ ట్రాక్ వీడియో.. అవాక్కవుతున్న నెటిజన్లు

Rajamouli Rashmi Video: దర్శక ధీరుడు రాజమౌళి, రష్మి కలిసి నటించిన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది అవాక్కవుతున్నారు.

Rajamouli Rashmi Video: సీరియల్‍లో రాజమౌళి, రష్మి మధ్య సన్నివేశం

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఇండియాలో టాప్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు. ఇక తెలుగు యాంకర్‌గా రష్మి గౌతమ్ కొనసాగుతున్నారు. అయితే, ఒకప్పుడు వీరిద్దరూ ఓ సీరియల్‍లో కలిసి నటించారు. సుమారు 17ఏళ్ల క్రితం ఇది జరిగింది. అయితే, ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుతోంది. ఆ వివరాలు ఇవే..

రాజమౌళి - రష్మి.. లవ్ ట్రాక్

యువ సిరీయల్‍లో రాజమౌళి, రష్మి లవ్ ట్రాక్ ఉంది. రాజమౌళి నిన్నే చూస్తున్నాడే అని ఫ్రెండ్ చెప్పడంతో ఇమాజినేషన్‍లోకి వెళుతారు రష్మి. విక్రమార్కుడు సిగ్నేచర్‌ జింతాత చేస్తూ.. తన వంకే రాజమౌళి చూస్తున్నట్టు ఊహించుకుంటారు. ఇంతలో రష్మి దగ్గరికి రాజమౌళి వస్తారు. తాను నమ్మలేకున్నానని, ఇన్ని రోజులు తనతో ఫోన్‍లో మాట్లాడుతోంది మీరా అని అడుగుతారు రష్మి.

ఐ లవ్ యూ.. ఆ మాత్రం తెలియదా..

గంటలకు ఓసారైనా మాట్లాడాలి కదా.. కుచ్‍కుచ్ హోతాహై అంటూ రాజమౌళి అంటారు. “నేను అంకుల్‍ను అయితే ఏం చేసే దానివి” అని ప్రశ్నిస్తారు. “పర్లేదు.. నేను కూడా ఆంటీ అయ్యేదాన్ని” అని రష్మి బదులిస్తారు. రేడియోలోనే కాదు.. బయట కూడా బాగా మాట్లాడున్నావే అంటూ రాజమౌళి పొగుడుతారు. తనకు సిగ్గుగా ఉందని రష్మి అంటే.. తనకు తొందరగా ఉందని రాజమౌళి అంటారు. చెప్పు.. చెప్పు అని రాజమౌళి అంటే.. అలా రొమాంటిక్‍గా చూస్తుంది రష్మి. కళ్లు మండుతున్నాయా అని రాజమౌళి ప్రశ్నిస్తే.. “దాని అర్థం ఐలవ్ యూ. నీకు కూడా తెలియదా” అని రష్మి అరుస్తుంది. అలా ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సీన్ ఉంది. ఈ యువ సీరియల్ 2008లో వచ్చింది.

ఇప్పుడు వైరల్.. నెటిజన్లు అవాక్కు

రాజమౌళి, రష్మి కలిసి నటించిన ఆ సీరియల్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “ఏంటి.. రాజమౌళి, రష్మి కలిసి నటించారా” అని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీనా అంటూ కొందరు అవాక్కవుతున్నారు. ఇదెప్పుడు జరిగిందని కొందరు రాసుకొస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

మహేశ్‍తో రాజమౌళి గ్లోబల్ సినిమా

ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేస్తున్నారు రాజమౌళి. గ్లోబల్ రేంజ్ అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా ఉండనుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం