Saranga Dariya Trailer: మందు, సిగరెట్ కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్ - ఇంట్రెస్టింగ్‌గా సారంగ‌ద‌రియా ట్రైల‌ర్-raja ravindra saranga dariya movie trailer unveiled by hero nikhil tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saranga Dariya Trailer: మందు, సిగరెట్ కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్ - ఇంట్రెస్టింగ్‌గా సారంగ‌ద‌రియా ట్రైల‌ర్

Saranga Dariya Trailer: మందు, సిగరెట్ కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్ - ఇంట్రెస్టింగ్‌గా సారంగ‌ద‌రియా ట్రైల‌ర్

Nelki Naresh Kumar HT Telugu
Jul 05, 2024 02:44 PM IST

Saranga Dariya Trailer: రాజార‌వీంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సారంగ‌ద‌రియా ట్రైల‌ర్ హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. మిడిల్ క్లాస్ క‌ష్టాల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ జూలై 12న రిలీజ్ కాబోతోంది.

సారంగ‌ద‌రియా ట్రైల‌ర్
సారంగ‌ద‌రియా ట్రైల‌ర్

Saranga Dariya Trailer: టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజా రవీంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సారంగ ద‌రియా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా జూలై 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. సారంగ ద‌రియా మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. మిడిల్ క్లాస్ క‌ష్టాల‌ను ఆవిష్క‌రిస్తూ ట్రైల‌ర్ ఎమోష‌న‌ల్‌గా సాగింది. ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ ఆలోచ‌న‌ను రేకెత్తిస్తోన్నాయి.

కులం అంటే ర‌క్తం కాదు...

‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.

‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అంటూ ట్రైల‌ర్‌లో వినిపిస్తోన్న డైలాగ్స్ చూస్తుంటే మంచి మెసేజ్‌తో ఈ మూవీ తెర‌కెక్కిస్తోన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా, టీచ‌ర్‌గా ఈ సినిమాలో రాజ్ ర‌వీంద్ర క‌నిపించ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

మిడిల్ క్లాస్ క‌ష్టాల‌తో...

సారంగ‌ద‌రియా సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. మధ్యతరగతి కుటుంబం బంధాలు, అనుబంధాల్ని స‌హ‌జంగా చూపించే మూవీ అని డైరెక్ట‌ర్ తెలిపాడు. బ్యూటీఫుల్‌ ఫ్యామిలీ ఎమోషన్స్, ల‌వ్‌, కామెడీ, సెంటిమెంట్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయ‌ని అన్నాడు.

అందుకోవా సాంగ్…

సారంగ‌ద‌రియా సినిమాలో రాజా రవీంద్రతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సారంగ‌ద‌రియా సినిమా నుంచి ఇటీవ‌లే లెజెండ‌రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’ అనే పాట‌తో పాటు ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ సాంగ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూడు పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పిస్తోన్నాయి. సారంగ‌ద‌రియా సినిమాకు ఎబ‌నెజ‌ర్ పాల్ మ్యూజిక్ అందించ‌గా వినయ్ కొట్టి డైలాగ్స్ రాశాడు.

చిరంజీవి మూవీతో...

చిరంజీవి య‌ముడికి మొగుడు సినిమాలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజా ర‌వీంద్ర హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మూడు వంద‌ల‌కుపైగా సినిమాలు చేశాడు. త‌మిళంలో యాభై వ‌ర‌కు సినిమాల్లో న‌టించాడు. తెలుగులో ఎఫ్ఐఆర్‌, జాన‌కి క‌ల‌గ‌న‌లేదుతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ప్ర‌స్తుతం నిఖిల్‌, రాజ్ త‌రుణ్‌తో పాటు పాటు మ‌రికొంత మంది టాలీవుడ్ యంగ్ హీరోల‌కు మేనేజ‌ర్‌గా రాజా ర‌వీంద్ర కొన‌సాగుతోన్నాడు.

WhatsApp channel