Bhale Unnade OTT: థియేటర్లలో రిలీజ్‌కు ముందే రాజ్‌తరుణ్ భలే ఉన్నాడే ఓటీటీ డీల్ క్లోజ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Bhale Unnade OTT: రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తోన్న భలే ఉన్నాడే మూవీకి డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నాడు. థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం.
Bhale Unnade OTT: రాజ్ తరుణ్ హిట్టు అనే మాట విని చాలా కాలమైంది. అతడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతోన్న అవకాశాలు మాత్రం దండిగానే అందుకుంటున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తోన్నాడు రాజ్‌తరుణ్.
భలే ఉన్నాడే...
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తోన్న భలే ఉన్నాడే మూవీ త్వరలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు జె శివసాయివర్ధన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. థియేటర్లలో రిలీజ్‌కు ముందే భలే ఉన్నాడే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నది. మారుతి నిర్మాణంలో భాగం కావడం, టీజర్స్‌తో మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ రేట్‌కు ఈటీవీ విన్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు
మనీషా కంద్కూర్ హీరోయిన్...
భలే ఉన్నాడే సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటిస్తోంది లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి (చెప్పవే చిరుగాలి, పోతు రాజు ఫేమ్), అమ్ము అభిరామి (నారప్ప ఫేమ్) డిఫరెంట్ రోల్స్ చేస్తోన్నారు.
లవ్‌స్టోరీ...
ఈ సినిమాలో రాధగా అమ్మాయిలకు అందంగా అలంకరించే ప్రొఫెషన్‌లో స్థిరపడ్డ యువకుడిగా రాజ్‌తరుణ్ కనిపించారు. కృష్ణ అనే అమ్మాయి పాత్రలో హీరోయిన్ కనిపించబోతుంది. భిన్న ధృవాలైన ఓ జంట ఎలా ప్రేమలో పడ్డారు? రాధను కృష్ణ తన దారిలోకి ఎలా తెచ్చుకుందన్నది వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించినట్లు టీజర్ చూస్తుంటే కనిపిస్తోంది.
శివసాయివర్ధన్‌కు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. గతంలో గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహించాడు. భలే ఉన్నాడే సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే భలే ఉన్నాడే మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.
నా సామిరంగతో హిట్...
నాగార్జున హీరోగా సంక్రాంతికి రిలీజైన నా సామిరంగలో రాజ్‌తరుణ్ ఓ హీరోగా కనిపించాడు. రివేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. సోలో హీరోగా హ్యాట్రిక్ సక్సెస్‌లతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్‌తరుణ్‌కు ప్రస్తుతం బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా అతడి గత సినిమాలేవి సరిగా ఆడలేదు.
నాలుగు సినిమాలు...
ఈ సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు రాజ్‌తరుణ్. అతడు హీరోగా నటించిన తిరగబడరా సామీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే పురుషోత్తముడు షూటింగ్ జరుగుతోంది. వీటితో పాటు మరో సినిమాను కూడా అంగీకరించాడు రాజ్‌తరుణ్.
ప్రభాస్‌తో రాజా సాబ్...
భలే ఉన్నాడేకి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న మారుతి ప్రస్తుతం ప్రభాస్‌తో రాజా సాబ్ మూవీ చేస్తోన్నాడు. సూపర్ నాచురల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. మారుతి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాపిక్