OTT Action Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-raj tarun action comedy movie purushothamudu to release on aha ott platform will be stream from august 29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Action Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Purushothamudu OTT Release Date: పురుషోత్తముడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు.

OTT Action Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ యాక్షన్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ చిత్రం జూలై 26వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ కామెడీ మూవీకి రామ్ భీమన దర్శకత్వం వహించారు.

పురుషోత్తముడు సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

పురుషోత్తముడు సినిమా ఆగస్టు 29వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (ఆగస్టు 26) అధికారికంగా ప్రకటించింది. “ధైర్యానికి ఉన్న శక్తిని చూసేందుకు రెడీగా ఉండండి. ఆగస్టు 29న పురుషోత్తముడు ఆహాలో ప్రీమియర్ కానుంది” అని ఆహా ట్వీట్ చేసింది.

పురుషోత్తముడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన హాసినీ సుధీర్ హీరోయిన్‍గా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను రామ్ భీమన తెరకెక్కించారు. యాక్షన్‍తో పాటు కామెడీ, లవ్ స్టోరీ కూడా ఈ చిత్రంలో ఉంటాయి. సీఈవో అవ్వాలని అనుకునే యువకుడు 100 రోజులు సామాన్యుడిలా జీవితం గడపడం అనే అంశం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.

పురుషోత్తముడు చిత్రాన్ని శ్రీశ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్ కలిసి నిర్మించారు. ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించారు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు. పీజీ వింద సినిమాటోగ్రఫీ చేశారు. పురుషోత్తముడు సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని.. థియేటర్లలో ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. రాజ్ తరుణ్ వేచిచూసిన హిట్ ఇవ్వలేకపోయింది.

పురుషోత్తముడు స్టోరీలైన్

లండన్‍లో చదువు పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వస్తాడు రచిత్ రామ్ (రాజ్ తరుణ్). తన కంపెనీకి రామ్‍ను సీఈవో చేయాలని అతడి తండ్రి ఆదిత్య రామ్ (మురళీ శర్మ) నిర్ణయిస్తాడు. అయితే, దీనికి రామ్ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డుపడుతుంది. సీఈవోగా పదవి చేపట్టాలంటే ముందుగా 100 రోజులు సామాన్యుడిలా జీవితం గడవాలనే నిబంధనను గుర్తు చేస్తుంది. దీంతో అజ్ఞాతంలో కామన్‍మ్యాన్‍లా జీవించేందుకు రామ్ రెడీ అవుతాడు. రాయపులంక అనే గ్రామానికి వెళతాడు. ఓ రైతు కూలిగా పని చేస్తాడు. అక్కడే అమ్ము (హాసినీ సుధీర్)తో రామ్ ప్రేమలో పడతాడు. ఆ ఊరి రైతులకు అండగా నిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కంపెనీకి రామ్ సీఈవో అయ్యాడా? ప్రేమను గెలిచాడా? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే విషయాలు పురుషోత్తముడు సినిమాలో ఉంటాయి.

కాగా, రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి సినిమా ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్‍గా నటించారు.

తనను పెళ్లి చేసుకొని రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ నటి లావణ్య ఆరోపణలు చేశారు. పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.