OTT Telugu Sci Fi: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్- 9.2 ఐఎమ్‌డీబీ రేటింగ్- ఇక్కడ చూసేయండి!
Rahasyam Idham Jagath OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్ రిలీజ్ అయింది. ఐఎమ్‌డీబీ నుంచి 9.2 రేటింగ్ సాధించిన నేటి నుంచి రహస్యం ఇదం జగత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకుందాం.
Telugu Science Fiction Mythological Thriller OTT: పర్ఫెక్ట్ కథా కథనంతో తెరకెక్కే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. అయితే, తెలుగులో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలు చాలా అరుదు. ఈ మధ్య కాలంలో జోనర్ ఎలాంటిది అయినా వాటికి కాస్తా మైథాలజీ టచ్ ఇస్తున్నారు.
హిందూ పురాణాలతో
అలా, హిందూ పురాణాలు, ఇతిహాసాల వంటి మైథలాజికల్ అంశాలను జోడిస్తూ తెలుగులో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీనే రహస్యం ఇదం జగత్. మొదటి నుంచి పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసిన రహస్యం ఇదం జగత్ సినిమాలో రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథ్ వంటి అంతా కొత్త వాళ్లు నటించారు.
శ్రీ చక్రం కాన్సెప్ట్
సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పద్మ రవినూతులు, హిరణ్య రావినూతుల నిర్మించిన రహస్యం ఇదం జగత్ మూవీకి కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హిందూ పురాణాలు, ఇతిహాసాలు, శ్రీ చక్రం వంటి విషయాలను టచ్ చేస్తూ తెరకెక్కించారు డైరెక్టర్.
ఐఎమ్‌డీబీ రేటింగ్
కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని డైరెక్టర్ కోమల్ ఆర్ భరద్వాజ్ తెరకెక్కిన రహస్యం ఇదం జగత్ నవంబర్ 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, చిన్న సినిమా కావడంతో పెద్దగా ఆడియెన్స్ దృష్టికి చేరుకోలేకపోయింది ఈ మూవీ. ఆడియెన్స్ నుంచి టాక్ ఎలా ఉన్నా రహస్యం ఇదం జగత్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 9.2 రేటింగ్ ఉంది.
15 మంది నుంచి వచ్చిన రేటింగ్
ఒక్క తెలుగు సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి ఇంతపెద్ద రేటింగ్ రావడం అనేది చాలా విశేషమని అని చెప్పుకోవాలి. పదికి 9.2 రేటింగ్ అంటే ఈ సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ రేటింగ్‌ను 15 మంది ఆడియెన్స్ ఇచ్చిన అభిప్రాయాన్ని బట్టి ఇచ్చినట్లు తెలుస్తోంది.
రహస్యం ఇదం జగత్ ఓటీటీ
ఇదిలా ఉంటే, ఒక యూనిక్ అండ్ ఎవరు టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కిన రహస్యం ఇదం జగత్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో రహస్యం ఇదం జగత్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఒక్క తెలుగు భాషలో రహస్యం ఇదం జగత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇతర భాషల్లో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
టైమ్ ట్రావెల్ చేయొచ్చనే కథ
అయితే, అమెరికాలో ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అన్వేషించారని, దాని కోసం జరిగిన తవ్వకాల ప్రదేశానికి చాలా దగ్గరగా ఉండటంతో అది తనను బాగా ఇన్‌స్పైర్ చేసిందని డైరెక్టర్ కోమల్ ఆర్ భరద్వాజ్ చెప్పారు. ఇలాంటి అంశాన్ని పురాణాలు, సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి వామ్ హోల్స్‌తో టైమ్ ట్రావెల్ చేయొచ్చనే కథగా మరింత ఇంట్రెస్టింగ్‌గా చెప్పొచ్చని మూవీ తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు.
టాపిక్