Raghavendrarao Tweet: కామెరూన్, స్పీల్‌బర్గ్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా - తమ్మారెడ్డికి రాఘవేంద్రరావు కౌంటర్
Raghavendra Rao Fire on Tammareddy: ఆస్కార్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ 80 కోట్లు ఖర్చు పెట్టిందంటూ సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు తప్పుపట్టారు. ట్విట్టర్ ద్వారా భరద్వాజకు రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు.
Raghavendra Rao Fire on Tammareddy: ఆస్కార్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ 80 కోట్లు ఖర్చుపెట్టిందంటూ సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతోన్నాయి. అతడి కామెంట్స్‌పై పలువురు టాలీవుడ్ సీని ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఆర్ఆర్ఆర్ పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలను సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తప్పుబట్టారు.
ట్రెండింగ్ వార్తలు
ట్విట్టర్ వేదికగా తమ్మారెడ్డి భరద్వాజకు కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తోన్న పేరును చూసి గర్వపడాలని రాఘవేంద్రరావు అన్నారు.
అంతేకానీ 80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా. జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా అంటూ భరద్వాజ కామెంట్స్‌పై రాఘవేంద్రరావు ట్వీట్ చేశాడు.
తమ్మారెడ్డికి ట్విట్టర్ ద్వారా స్ట్రాంగ్ గానే బదులిచ్చాడు రాఘవేంద్రరావు. తమ్మారెడ్డికి సరైన విధంగా ఆన్సర్ చెప్పారంటూ రాఘవేంద్రరావు కు ఫ్యాన్స్ మద్దతునిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ కోసం 80 కోట్ల ఖర్చు చేసిందని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేశారు. వారు ఫ్లైట్ టికెట్స్ కోసం పెట్టిన డబ్బులతో 8 నుంచి 10 సినిమాలు తీయోచ్చని తమ్మారెడ్డి భరద్వాజ అన్నాడు. అతడి కామెంట్స్‌పై ఆర్ఆర్ఆర్ తో పాటు టాలీవుడ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.