Raghavan OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జోనర్స్‌ను మాత్రమే ఆడియెన్స్ విపరీతంగా ఆదరిస్తారు. వాటిలో ఒకటే క్రైమ్ థ్రిల్లర్స్. ఒక క్రైమ్ దానిచుట్టూ అల్లుకునే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.
స్టోరీ పెద్దగా లేకున్నా ఊహించని మలుపులతో, ఎంగేజింగ్ సీన్లతో తెరకెక్కిస్తే వాటికి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అయితే, ఇప్పుడు చాలా వరకు ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు వచ్చాయి. వాటన్నింటిని చూసిన ఆడియెన్స్ కొత్తగా రిలీజ్ అయ్యే మూవీస్‌లో చాలా కొత్తదనం వెతుక్కుంటున్నారు. కానీ, ఎవరు ఊహించని విధంగా, హాలీవుడ్ స్టైల్‌లో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉంది.
అదే రాఘవన్. తమిళంలో వేట్టైయాడు విళయాడు టైటిల్‌తో మొదటగా రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగులో రాఘవన్ పేరుతో విడుదల చేశారు. 2006 సంవత్సరంలో ఊహించని ట్విస్టులు, మలుపులు, థ్రిల్లింగ్ సీన్లతో రాఘవన్‌ను తెరకెక్కించారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఘర్షణ, ఏ మాయ చేశావే వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ రాఘవన్ వంటి డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌ను చిత్రీకరించారు.
అప్పట్లో ఈ సినిమాకు విపరీతమైన ప్రశంసలు కురిశాయి. అందుకే ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి 10కి 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. 2006 ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదలైన రాఘవన్ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, జ్యోతిక, కమలినీ ముఖర్జీ, డేనియల్ బాలాజీ, సలీం బేగ్, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు.
ఇక హరీస్ జయరాజ్ అందించిన సంగీతం కూడా రాఘవన్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. బీజీఎమ్‌తో ఆకట్టుకున్నారు. చిన్నతనం నుంచి నేర ప్రవృత్తి కలిగిన ఇద్దరు అమ్మాయిలతో శృంగారం చేసి కిరాతకంగా చంపుతుంటారు. పైగా వారు విదేశాల్లో పేరు మోసిన డాక్టర్స్‌గా చలామణి అవుతారు. మాజీ ఎస్పీ కూతురు కిడ్నాప్, మర్డర్‌తో వారి నేర చరిత్ర గురించి తెలుస్తుంది.
అక్కడి నుంచి ఆ సైకో డాక్టర్స్‌ను డీసీపీ రాఘవన్ ఎలా పట్టుకున్నాడు, ఈ క్రమంలో సైకో డాక్టర్స్ చేసిన క్రైమ్స్ ఏంటీ, వారి ఎంతమంది అమ్మాయిలను బలవంతంగా సెక్స్ చేసి కిరాతంగా హత్య చేశారు వంటి విషయాలను వెలుగులోకి ఎలా తీసుకొచ్చాడు, రాఘవన్ గతం ఏంటీ, ఆరాధన (జ్యోతిక)తో పరిచయం ఎటువైపు దారితీసింది, కిల్లర్స్‌ను రాఘవన్ పట్టుకున్నాడా వంటి సన్నివేశాలతో ఉత్కంఠంగా మూవీ సాగుతుంది.
ఆద్యంతం మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే రాఘవన్ 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో రాఘవన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, సన్ ఎన్‌ఎక్స్‌టీలో తమిళ భాషలో వేట్టైయాడు విళయాడు ఓటీటీ రిలీజ్ అయింది. ఈ రెండింటింతోపాటు ఆహా ఓటీటీలో కూడా రాఘవన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, ఎవరికి వీలైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రాఘవన్ మూవీని వీక్షించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్