Jigarthanda Double X Twitter Review: జిగర్తాండ డబుల్ ఎక్స్ ట్విట్టర్ రివ్యూ.. ఆ 40 నిమిషాలు హైలెట్
Jigarthanda Double X First Review: డైరెక్టర అండ్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా జిగర్ తండా డబుల్ ఎక్స్. నవంబర్ 10 అంటే నేడు విడుదల కానున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ ట్విట్టర్ రివ్యూ రానే వచ్చేసింది. మరి జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా.
Twitter Review Of Jigarthanda Double X: రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన హై యాక్షన్ డ్రామా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. దీపావళి సందర్బంగా జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ నవంబర్ 10న రిలీజ్ అవుతుంది. వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను కార్తీకేయన్ నిర్మించారు. ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో శుక్రవారం రిలీజ్ కానుంది.

అయితే, జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా చూసిన పలువురు రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో ధనుష్ రివ్యూ వైరల్ అవుతోంది. "జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా చూశాను. కార్తీక్ సుబ్బరాజ్ నుంచి వచ్చిన మరో ఫెంటాస్టిక్ చిత్రం. అద్భుతంగా నటించడం ఎస్‌జే సూర్యకు అలవాటు అయిపోయింది. ఒక నటుడుగా రాఘవ లారెన్స్ అదరగొట్టాడు. సంతోషన్ నారాయణ్ మ్యూజిక్ బాగుంది. చివరి 40 నిమిషాలు మనసును దోచుకుంటుంది. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్" అని ధనుష్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా గురించి ధనుష్ చేసిన కామెంట్స్ పై చాలా మంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. అలాగే ఎప్పటికీ బెస్ట్ రివ్యూవర్ అంటూ నెటిజన్స్ ధనుష్‌ను పొగుడుతున్నారు. ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ ఇంకా బాగుందని రివ్యూ వచ్చింది. "ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్ పర్ఫామెన్స్ అల్టిమేట్. మ్యూజిక్ అదిరిపోయింది. స్క్రీన్ ప్లే బ్రిలియంట్‌గా ఉంది. క్లైమాక్స్ 40 నిమిషాలు వేరే లెవెల్. చూడాదగ్గ సినిమా" అని రివ్యూలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాను సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని సమాచారం. 1975 నాటి కాలం కథతో మూవీ తెరకెక్కించారు. ఇదివరకు 2014లో వచ్చిన జిగర్తాండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ మూవీనే తెలుగులో గద్దలకొండ గణేష్ టైటిల్‌తో రీమేక్ చేశారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వరుణ్ తేజ్, అథర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి నటించారు.