సివరాపల్లి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించాడు రామ్‌మయూర్. పంచాయత్ వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో సెక్రటరీ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. సమంత ప్రొడ్యూసర్‌గా ఇటీవల రిలీజైన శుభంలో రామ్‌మయూర్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. థియేటర్లలో తన క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని రాగ్ మయూర్ అన్నాడు.
‘‘సినిమా బండి మూవీలో నేను చేసిన మరిడేష్ బాబు క్యారెక్టర్ ప్రేక్షకులను నవ్వించింది. మరిడేష్ బాబు క్యారెక్టర్‌కు కొనసాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్రను దర్శకుడు ప్రవీణ్ చాలా సరదాగా డిజైన్ చేశారు. ఆయన కథ నెరేట్ చేసిన తర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అర్థమైంది. అందుకనే శుభం సినిమా చేశా. నా నమ్మకం నిజమైంది. నా పాత్రను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తోన్నారు’’ అని రాగ్ మయూర్ అన్నాడు.
ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్నమూడో మూవీ ‘పరదా’లో రాగ్ మయూర్ నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి తెరపై సందడి చేయబోతున్నాడు. పరదా మూవీ గురించి రాగ్ మయూర్ మాట్లాడుతూ ‘‘పరదా’ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్‌లో చాలా సస్పెన్స్ ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా సర్‌ప్రైజింగ్‌గా ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే మూవీ ఇది’’ అన్నారు.
ప్రస్తుతం GA2 నిర్మాణంలో రూపొందుతోన్న బడ్డీ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు రాగ్ మయూర్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న గరివిడి లక్ష్మి సినిమాలోనూ లీడ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ద బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
‘యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న భిన్నమైన పాత్రల్లో నటించటం నటుడిగా నాకెంతో ఆనందంగా ఉంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నన్ను వెతుక్కుంటూ రావటం చాలా ఆనందంగా ఉంది. అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్నాను. ప్రతిభావంతులైన టెక్నీషియన్స్‌తో పని చేయటం వల్ల, వారితో కలిసి జర్నీ చేయటం వల్ల నటుడిగా నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం కలుగుతోంది’’అని పేర్కొన్నారు రాగ్ మయూర్.
గత ఏడాది వీరాంజనేయులు విహార యాత్ర, గాంధీ తాత చెట్టు, శ్రీరంగనీతులు సినిమాలు చేశాడు రాగ్‌మయూర్.
సంబంధిత కథనం