Rag Mayur: ఒకేరోజు హీరోగా, విలన్‌గా పేరు తెచ్చుకున్న రాగ్ మయూర్.. ఒకటి మూవీ, మరోటి ఓటీటీ కామెడీ వెబ్ సిరీస్!
Rag Mayur Became Hero And Villain In One Day: ఒకేరోజు హీరోగా, విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు సినిమా బండి ఫేమ్ రాగ్ మయూర్. ఒకటి థియేట్రికల్ మూవీ అయితే, మరోటి ఓటీటీ కామెడీ వెబ్ సిరీస్‌తో ఈ క్రేజ్ సంపాదించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Rag Mayur Became Hero And Villain In One Day: సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ అనే వెబ్ సిరీస్‌లో రాగ్ మయూర్ హీరో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా
‘పంచాయత్’ అనే సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు. నిజానికి ఇది రీమేక్ వెబ్ సిరీసే. కానీ, ఎక్కడా తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకనిర్మాతలు.
అమెరికా వెళ్లాల్సింది
అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే.. ఆ పల్లెటూరికి వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడు? ఇష్టం లేని ఉద్యోగం ఎలా చేశాడు? లాంటి విషయాలను ప్రేక్షకులకు కన్వే చేసేలా తనదైన శైలిలో నటించడమే కాకుండా జీవించేశాడు రాగ్ మయూర్.
సుకుమార్ కుమార్తె సినిమా
అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 24న సివరపల్లి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. దాంతో హీరోగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు రాగ్ మయూర్. ఇక అదే రోజున (జనవరి 24) థియేటర్లలో గాంధీ తాత చెట్టు సినిమా రిలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు మూవీ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించాడు.
క్లైమాక్స్ సీన్‌లో
అయితే, ఇందులో కాస్తా నెగెటివ్ రోల్‌లో మెరిశాడు. చాలా ఈజ్‌తో ఎక్కడ నటిస్తున్నాడని భావన రాకుండా ఆ సతీష్ అనే పాత్రలో ఇమిడిపోయాడు హాగ్ మయూర్. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో విలనిజంతో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా వర్క్ అవుట్ అయిందని కామెంట్స్ వినిపించాయి.
హీరోగా, విలన్‌గా
అయితే, ఇలా ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రిటిక్స్ తమ రివ్యూలలో రాగ్ మయూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా ఒక్కరోజులోనే అటు హీరోగా ఇటు విలన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రాగ్ మయూర్.
మూడు సినిమాలతో
ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని రాగ్ మయూర్ భావిస్తున్నాడని సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ సినిమాతో పాటు పరదా, గరివిడి లక్ష్మి సినిమాల్లో నటిస్తూ వరుస ఆఫర్స్‌తో సత్తా చాటుతున్నాడు రాగ్ మయూర్.
సంబంధిత కథనం