Iddaru Review: ఇద్దరు రివ్యూ - సెంట్రల్ మినిస్టర్ భార్య హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ హిట్టా? ఫట్టా?
Iddaru Review: కేంద్ర మంత్రి కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి హీరోయిన్‌గా నటించిన ఇద్దరు మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో అర్జున్, జేడీ చక్రవర్తి హీరోలుగా నటించారు.
అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా నటించిన మూవీ ఇద్దరు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సమీర్ దర్శకత్వం వహించాడు. కేంద్ర మంత్రి కుమారస్వామి భార్యరాధిక కుమారస్వామి ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
సంజయ్ రామస్వామి కథ...
సంజయ్ రామస్వామి (అర్జున్) ఓ బిజినెస్ టైకూన్. కోట్లకు అధిపతి అయిన అతడు అంజలి (రాధిక కుమారిస్వామి) ఇష్టపడతాడు పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. సంజయ్ కంటే ముందు చక్రిని(జేడీ చక్రవర్తి) ప్రేమిస్తుంది అంజలి. చక్రి ప్లాన్ ప్రకారమే ఆమె సంజయ్‌ని ప్రేమిస్తున్నట్లుగా నాటకం ఆడుతుంది. అంజలితో చక్రి ఈ నాటకం ఎందుకు అడిస్తున్నాడు. సంజయ్‌ని మోసం చేయాలని ఎందుకు అనుకున్నాడు. చక్రి ప్లాన్‌ను సంజయ్ ఎలా తిప్పికొట్టాడు? చక్రి, సంజయ్‌లలో అంజలి నిజంగా ఎవరిని ప్రేమించింది అన్నదే ఇద్దరు మూవీ కథ.
హనీ ట్రాప్...
హానీ ట్రాప్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు సమీర్ ఇద్దరు మూవీని తెరకెక్కించాడు. మగువ అందానికి ఎంతటి చక్రవర్తి అయినా దాసోహం కావాల్సిందే. హనీ ట్రాప్ కారణంగా సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎలా మోసపోతున్నారు. అందాన్ని పెట్టుబడిగా వారిని కొందరు ఏ విధంగా దోచుకుంటున్నారన్నది ఈ మూవీలో చూపించాడు.
ట్విస్ట్‌లు...టర్న్‌లు..
అందమైన అమ్మాయిని పావుగా వాడుకొని కోటీశ్వరుడిని ఆస్తిని కొట్టేయాలని చూసిన క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తికి తెలివిపరుడైన బిజినెస్‌మెన్ ఎలా చెక్ పెట్టాడు అన్నదే ఈ మూవీ కథ. ఈ స్టోరీని ట్విస్ట్‌లు టర్న్‌లతో చివరి వరకు ఎంగేజింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్ సమీర్.
లవ్ స్టోరీ…
సంజయ్ రామస్వామి అనే మల్టీమిలియనీర్‌గా అర్జున్, అంజలితో అతడి లవ్‌స్టోరీ చుట్టూ ఫస్ట్‌హాఫ్ సాగుతుంది. సంజయ్, అంజలి లవ్ వెనుక చక్రి ఉన్నాడని రివీలయ్యే సీన్ బాగుంది. చక్రి ఇదంతా ఎందుకు చేస్తున్నాడున్నది చెబుతూ సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చక్రి మోసాన్ని సంజయ్ ఎలా తెలుసుకున్నాడు? అతడి ప్లాన్స్‌ను ఎలా తిప్పికొట్టాడన్నది సెకండాఫ్‌లో హీరో, విలన్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులతో చూపిస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయాలని అనుకున్నాడు.
ఇందులో కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో వచ్చే మలుపులన్నీ చాలా వరకు ప్రెడిక్టబుల్‌గానే అనిపిస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలిసిపోతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఎండ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు
నెగెటివ్ క్యారెక్టర్‌లో...
సంజయ్ రామస్వామి పాత్రలో అర్జున్ నటన బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. నెగెటివ్ క్యారెక్టర్‌లో జేడీ చక్రవర్తి డైలాగ్ డెలివరీతోనే విలనిజాన్ని పండించిన తీరు బాగుంది. రాధికా కుమారస్వామి నటన ఓకే అనిపిస్తుంది. దివంగత దర్శకుడు కే విశ్వనాథ్ కనిపించే సీన్స్ ఆకట్టుకుంటాయి. సోనీ ఛరిష్టా, నేహా చౌదరితో పాటు చాలా మంది ఆర్టిస్టులు సినిమాలో కనిపిస్తారు.
పక్కా కమర్షియల్ మూవీ...
ఇద్దరు పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. సీనియర్ హీరోలు అర్జున్, జేడీ చక్రవర్తి యాక్టింగ్ కోసం ఓ సారి ఈ మూవీని చూడొచ్చు.
రేటింగ్: 2.5/5