Radhe Shyam | ‘రాధేశ్యామ్’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమే..-radhe shyam first week collections worldwide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Radhe Shyam | ‘రాధేశ్యామ్’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమే..

Radhe Shyam | ‘రాధేశ్యామ్’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమే..

HT Telugu Desk HT Telugu
Mar 19, 2022 05:08 PM IST

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చి వారం రోజులు అయ్యింది. ఫ‌స్ట్ వీక్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వ‌సూళ్లు సాధించిందంటే…

<p>ప్రభాస్, పూజాహెగ్డే</p>
ప్రభాస్, పూజాహెగ్డే (instagram)

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ చిత్రం భారీ అంచ‌నాల‌తో గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీ నేప‌థ్యంలో జ‌రిగే ల‌వ్‌స్టోరీగా దాదాపు రెండు వంద‌ల కోట్ల వ్య‌యంతో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాను తెర‌కెక్కించాయి. పాట‌లు, ప్ర‌చార చిత్రాల్లో  ప్ర‌భాస్ లుక్‌, పూజాహెగ్డేతో అత‌డి కెమిస్ట్రీ హైలైట్‌గా నిల‌వ‌డంతో ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది.  కానీ క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఆ అంచ‌నాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా బోల్తా కొట్టింది. 

 తొలివారంలో ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేవ‌లం 78 కోట్ల షేర్ మాత్ర‌మే రాబట్టింది. అందులో నైజాం మిన‌హా మిగిలిన చోట్ల పెద్ద‌గా వ‌సూళ్లు రాలేదు. మొదటి వారంలో నైజాం ఏరియాలో ఈ సినిమాకు 23 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మిగిలిన చోట్ల అందులో స‌గం కూడా రాలేదు. ఈ సినిమాతో నిర్మాత‌లు దాదాపు వంద కోట్ల‌కుపైనే న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమేనని అంటున్నారు.

హిందీలో ప్ర‌భాస్ కెరీర్‌లోనే అత్య‌ల్పం..

హిందీలో ‘రాధేశ్యామ్’ చిత్రం ప్రేక్ష‌కుల తిర‌స్కారానికి గురైంది. బాలీవుడ్‌లో ఈ సినిమాకు  ప్ర‌భాస్ తోపాటు చిత్ర‌యూనిట్ భారీగానే ప్ర‌మోష‌న్స్ చేసింది. అవేవీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. తొలివారంలో ఈ సినిమాకు 18 కోట్ల గ్రాస్ మాత్ర‌మే వ‌చ్చింది. ప్రభాస్ నటించిన గత చిత్రాలు బాహుబ‌లి, సాహో సినిమాల‌తో పోలిస్తే ఈ చిత్రానికి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చాలా త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. 

Whats_app_banner