Raayan Trailer Twitter Review: ఇంటెన్స్‌గా ధనుష్ రాయన్ మూవీ ట్రైలర్.. నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందంటే..
Raayan Trailer Twitter Review: రాయన్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. హీరోగా నటించిన ధనుష్ దర్శకత్వం కూడా వహించారు. ఈ ట్రైలర్‌పై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..
తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రాయన్ మూవీ తెరకెక్కుతోంది. ధనుష్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ వస్తోంది. హీరోగా ధనుష్‍కు ఇది 50వ చిత్రంగా ఉంది. రాయన్ మూవీ జూలై 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ చిత్రం నుంచి నేడు (జూలై) ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌పై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..
ట్రైలర్ ఇలా..
రాయన్ ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‍గా ఉంది. యాక్షన్, డ్రామాతో నిండిపోయింది. కాస్త హింస కూడా ఎక్కువగానే ఉంది. అడవిలో బలమైన జంతువులు పులి, సింహమేనని.. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు ఉంటూ ట్రైలర్లో డైలాగ్ ఉంది. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలిచినా.. తోడేలు జిత్తుల మారిది అంటూ డైలాగ్ కొనసాగింది. ఎస్‍జే సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ కూడా ట్రైలర్లో కనిపించారు. ‘వాడు మగాడు.. ధైర్యశాలి అయితే ఇక్కడి వచ్చి నిలబడమను’ అంటూ ఎస్‍జే సూర్య డైలాగ్ తర్వాత.. “బ్రహ్మరాక్షసుడిగా వస్తాడు.. దహనం చేస్తాడు” అని సెల్వరాఘవన్ అంటారు. ఆ తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంది.
ఈ ట్రైలర్లో ధనుష్ మొత్తం యాక్షన్ సీన్లలోనే కనిపించారు. ధనుష్ వెంట సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం ఉన్నారు. చిన్నతనంలో వర్షంలో ముగ్గురు నడుకుంటూ వెళ్లే షాట్‍తో రాయన్ ట్రైలర్ ముగిసింది. రాయన్ ట్రైలర్లో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా చివర్లో బ్యాక్‍గ్రౌండ్‍లో వచ్చే సాంగ్ బిట్ ఎమోషనల్‍గా ఉంది.
నెటిజన్ల రియాక్షన్ ఇదే
రాయన్ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు చేస్తున్నారు. ఇంటెన్స్‌గా ఉండే పక్కా యాక్షన్ థ్రిల్లర్‌ను ధనుష్ తీసుకొస్తున్నారని, ట్రైలర్ అదిరిపోయిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ టేకింగ్ అద్భుతంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్‍తో పాటు ఈ చిత్రంలో డ్రామా, ఎమోషన్లు కూడా బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. కోలీవుడ్‍లో భారీ బ్లాక్‍బస్టర్ రానుందంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.
రాయన్ ట్రైలర్లో ఉన్న డిఫరెంట్ కలర్ టెంప్లేట్ల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ కొన్ని సీన్లలో ఉన్నాయి. ఈ కలర్స్ ఆ సీన్ల థీమ్‍ను తెలియజేసేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వెట్రిమారన్ స్టైల్‍లో రస్టిక్ వైలెన్స్‌తో మూవీ ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్లాష్‍బ్యాక్ చాలా ముఖ్యంగా, ఎమోషనల్‍గా సాగుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్లో ఏఆర్ రహమాన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍పై కూడా ప్రశంసలు వస్తున్నాయి. సీన్లను ఎలివేట్ చేసేలా బీజీఎం ఉంటుందని అంటున్నారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్లో అదిరిపోయింది.
రాయన్ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ వస్తుంది. జూలై 27న రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధనుష్, ఎస్‍జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, సెల్వరాఘవన్, ప్రకాశ్ రాజ్, దసరా విజయన్, అపర్ణ బాలమురళి ఈ మూవీలో కీరోల్స్ చేశారు.