Raayan box office collection: ధనుష్ 50వ సినిమా.. రూ.50 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న రాయన్-raayan box office collections dhanush 50th movie crossed 50 crores mark in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raayan Box Office Collection: ధనుష్ 50వ సినిమా.. రూ.50 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న రాయన్

Raayan box office collection: ధనుష్ 50వ సినిమా.. రూ.50 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న రాయన్

Hari Prasad S HT Telugu
Jul 31, 2024 11:01 AM IST

Raayan box office collection: ధనుష్ 50వ సినిమా రాయన్ బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల మార్క్ దాటింది. ఐదు రోజుల్లోనే ఇండియాలో ఈ మార్క్ దాటడం చూస్తుంటే ఈ సినిమా హిట్ అనే చెప్పాలి.

ధనుష్ 50వ సినిమా.. రూ.50 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న రాయన్
ధనుష్ 50వ సినిమా.. రూ.50 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న రాయన్

Raayan box office collection: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన మూవీ రాయన్. తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజై మంచి విజయం సాధించిన ఈ సినిమా ఐదు రోజుల్లో ఇండియాలోనే రూ.50 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించిన రాయన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.

yearly horoscope entry point

రాయన్ బాక్సాఫీస్ కలెక్షన్

రాయన్ మూవీలో ధనుష్ నటించి, దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా ఐదో రోజు ఇండియాలో రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టడం విశేషం. దీంతో మొత్తంగా ఐదు రోజుల్లో రాయన్ మూవీ కలెక్షన్లు రూ.52.95 కోట్లకు చేరాయి. మంగళవారం (జులై 31) ఈ సినిమా తమిళంలో ఆక్యుపెన్సీ 22.48 శాతంగా ఉంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమ, మంగళవారాల్లోనూ కలెక్షన్ల విషయంలో రాయన్ ఫర్వాలేదనిపించింది.

గత శుక్రవారం (జులై 26) రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో రూ.13.65 కోట్ల నెట్ కలెక్షన్లతో మొదలుపెట్టింది. తర్వాత రెండో రోజు రూ.13.75 కోట్లు, మూడో రోజు రూ.15.25 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజైన సోమవారం కలెక్షన్లు భారీగా తగ్గినా.. రూ.5.8 కోట్లతో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక మంగళవారం ఈ వసూళ్లు మరింత తగ్గి రూ.4.5 కోట్లకు చేరాయి.

రాయన్‌పై మహేష్ బాబు ప్రశంసలు

ధనుష్ నటించిన ఈ రాయన్ మూవీ చూసి తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అని అతడు ట్వీట్ చేయడం విశేషం.

"రాయన్.. ధనుష్ మెరిశాడు.. అద్భుతంగా డైరెక్ట్ చేయడంతోపాటు నటించాడు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్ రాజ్, సందీప్ కిషన్, మొత్తం నటీనటులందరూ చాలా బాగా నటించారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఎలక్ట్రిఫయింగ్ స్కోర్ అందించాడు. కచ్చితంగా చూడాల్సిన సినిమా. మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు" అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

దీనిపై ధనుష్ కూడా స్పందించాడు. “థ్యాంక్యూ మహేష్ బాబు గారు. దీనికి ఎంతో పెద్ద మనసు కావాలి. మా టీమ్ చాలా థ్రిల్ గా ఫీలైంది” అని అతను అనడం విశేషం.

రాయన్ ఎలా ఉందంటే?

అన్న‌త‌మ్ముళ్ల సెంటిమెంట్ ఫార్ములా ఒక‌ప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఊపు ఊపేసింది. త‌మ్ముళ్ల బాగుకోసం అన్న ఏన్నో పోరాటాలు, త్యాగాలు చేయ‌డం అనే సెంటిమెంట్ క‌థ‌ల‌తో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, బాల‌కృష్ణ వంటి స్టార్ హీరోలు ప‌లు సినిమాలు చేసి విజ‌యాల్ని అందుకున్నారు. రాయ‌న్ అదే ఫార్ములాతో వ‌చ్చిన రెగ్యుల‌ర్ రివేంజ్ డ్రామా మూవీ.

రొటీన్ స్టోరీకి త‌న‌దైన ట్రీట్‌మెంట్‌తో కొత్త‌ద‌నం జోడించారు ద‌ర్శ‌కుడు ధ‌నుష్‌. సినిమా కంప్లీట్‌గా రా అండ్ ర‌స్టిక్‌గా సాగుతుంది. మాస్ యాంగిల్ వ‌ల్లే సినిమాలో ప్రెష్‌నెస్ క‌నిపించింది. సినిమాలో ధ‌నుష్ క్యారెక్ట‌ర్ మొత్తం అండ‌ర్‌ప్లేతో సాగుతుంది. అత‌డికి ఓ భీభ‌త్స‌మైన ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉంటుంద‌ని స‌స్పెన్స్ క్రియేట్ చేస్తూవెళ్లాడు డైరెక్ట‌ర్‌. సినిమా బోర్‌గా సాగిపోతూ ట్రాక్ త‌ప్పుతుంద‌న్న టైమ్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, ఎలివేష‌న్స్‌తో నిల‌బెట్టాడు ధ‌నుష్‌.

Whats_app_banner