Horror Movie: 120 ఏళ్ల క్రిత నాటి ఆత్మలను కలిస్తే - హాలీవుడ్ స్టైల్‌లో రాశీఖన్నా హారర్ మూవీ ట్రైలర్
Horror Movie: రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న హారర్ మూవీ అగత్యా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్‌లోని హారర్ ఎలిమెంట్స్, విజువల్స్, లొకేషన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకుతెస్తోన్నాయి. అగత్యా మూవీలో జీవా హీరోగా నటిస్తోన్నాడు. ఫిబ్రవరి 28న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
Horror Movie: రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్నహారర్ మూవీ అగత్యా ట్రైలర్ రిలీజైంది. పా విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో జీవా హీరోగా నటిస్తోన్నాడు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న అగత్యా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సుమారు 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు అనే వాయిస్‌తో ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది.కష్టపడేవాడు హిస్టరీలో చోటు సంపాదించుకోవడం లేదు... తెలివిని ఎవరు నాశనం చేయలేరు. దొంగిలించలేరు అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి.
యోగిబాబు కామెడీతో...
చివరలో స్కేరీ హౌజ్‌ను క్యారీ బ్యాగ్‌గా యోగిబాబు చెప్పిన డైలాగ్ నవ్వులను పంచుతోంది.అగత్యా మూవీలో ఆర్ట్ డైరెక్టర్‌గా జీవా కనిపిస్తోండగా, సిద్ధ వైద్యం రీసెర్చర్ పాత్రలో సీనియర్ యాక్టర్ అర్జున్ నటిస్తున్నాడు. ఎన్ఆర్ఐ యువతిగా రాశీఖన్నా నటిస్తోంది.
బంగళా మిస్టరీ...
ఓ పాత కాలం నాటి బంగళా మిస్టరీని ఛేదించే క్రమంలో ఆర్ట్ డైరెక్టర్‌తో పాటు అతడి టీమ్‌కు ఎదురయ్యే సంఘటనలతో అగత్యా మూవీ తెరకెక్కింది. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, లోకేషన్స్, బిల్డింగ్‌లు హాలీవుడ్ సినిమాలు ది కంజూరింగ్, ఇన్సిడియస్‌లను గుర్తుకు తెస్తోన్నాయి.
హాలీవుడ్ యాక్టర్స్...
హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో నెవర్ బిఫోర్ ఎక్సపీరియన్స్ ను ఈ మూవీ అందిస్తోందని మేకర్స్ చెబుతోన్నారు. . జీవా, అర్జున్ సర్జా యాక్టింగ్. రాశీఖన్నా రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని తెలిపారు. లిరిసిస్ట్ పా విజయ్ డైరెక్షనల్ టేకింగ్‌తో పాటు యువన్ శంకర్ రాజా బీజీఎం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెబుతోన్నారు. ఈ మూవీలో పలువురు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ తో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం రాశీఖన్నా తెలుగులో తెలుసు కదా సినిమా చేస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ మూవీతో స్టైలిష్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు బ్లాక్ సక్సెస్ తర్వాత జీవా చేస్తోన్న మూవీ ఇది. మరోసారి హారర్ మూవీతోనే తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు.
సంబంధిత కథనం