Raai Laxmi: హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న రాయ్ లక్ష్మీ.. తొలి హీరోతోనే మళ్లీ.. కుస్తీ నేపథ్యంలో జనతాబార్-raai laxmi janata bar movie trailer released by hero srikanth and laxmi raai re entry as heroine ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raai Laxmi: హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న రాయ్ లక్ష్మీ.. తొలి హీరోతోనే మళ్లీ.. కుస్తీ నేపథ్యంలో జనతాబార్

Raai Laxmi: హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న రాయ్ లక్ష్మీ.. తొలి హీరోతోనే మళ్లీ.. కుస్తీ నేపథ్యంలో జనతాబార్

Sanjiv Kumar HT Telugu
Apr 12, 2024 06:41 AM IST

Raai Laxmi Janata Bar Movie: అందాల నటి రాయ్ లక్ష్మీ మళ్లీ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. కుస్తీ నేపథ్యంలో వస్తున్న జనతాబార్ సినిమా ట్రైలర్‌ను ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సినిమా పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న రాయ్ లక్ష్మీ.. తొలి హీరోతోనే మళ్లీ.. కుస్తీ నేపథ్యంలో జనతాబార్
హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న రాయ్ లక్ష్మీ.. తొలి హీరోతోనే మళ్లీ.. కుస్తీ నేపథ్యంలో జనతాబార్

Janata Bar Movie Trailer: బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ చాలా కాలం గ్యాప్ తర్వాత మెయిన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటివరకు సౌత్, నార్త్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే తన మొదటి తెలుగు సినిమా కాంచనమాల కేబుల్ టీవీలో హీరోగా చేసిన శ్రీకాంత్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. మళ్లీ తన తొలి హీరోతో ప్రమోషన్స్ చేస్తూ హీరోయిన్‌గా మళ్లీ అడుగుపెట్టనుంది రాయ్ లక్ష్మీ.

రాయ్ ల‌క్ష్మీ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న తెలుగు చిత్రం జ‌న‌తాబార్‌ (Janata Bar Movie). రోచిశ్రీ మూవీస్ ప‌తాక‌పంపై అశ్వ‌థ్‌ నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ మొగిలి స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు శ‌క్తి క‌పూర్ (సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి) ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ జనతా బార్ ట్రైలర్‌ను హీరో శ్రీ‌కాంత్ విడుద‌ల చేశాడు. అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మేలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

"కుస్తీ పోటీల నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది. నేటి స‌మాజంలో స్త్రీ ప్రాధాన్య‌త‌ను చాటి చెప్పే చిత్ర‌మిది. నాలుగు పాట‌లు, ఫైట్స్‌ల‌తో కొన‌సాగే రెగ్యుల‌ర్ చిత్రం కాదు. క‌మ‌ర్షియాల్ అంశాలు ఉంటూనే స‌మాజానికి చ‌క్క‌ని సందేశాన్ని మేళ‌వించి రూపొందించిన చిత్ర‌మిది" అని ఈ సందర్భంగా డైరెక్టర్ రమణ మొగిలి తెలిపారు.

"తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో ర‌మ‌ణ మొగిలి చెప్పిన ఈ క‌థ న‌న్ను ఎంతో ఆలోచింప‌జేసింది. ఒక‌వేళ ఈ చిత్రం చేయ‌క‌పోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని. న‌న్ను నేను కొత్తగా ఆవిష్క‌రించుకోవ‌డానికి ఈ సినిమా ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌ గ‌ర్ల్‌గా ప్రారంభ‌మై స‌మాజంలో మ‌హిళ‌లు గొప్ప‌గా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది" అని హీరోయిన్ రాయ్ లక్ష్మీ తెలిపింది.

"యానిమ‌ల్ త‌రువాత ఈ చిత్రంలో మ‌ళ్లీ ఓ మంచి పాత్ర‌ను చేశాను. ఈ సినిమాలో నా పాత్ర న‌లుగురు చెప్పుకునేంత గొప్ప‌గా ఉంటుంది" అని బాలీవుడ్ పాపులర్ నటుడు శ‌క్తిక‌పూర్ తెలిపారు. కాగా జనతాబార్ సినిమాలో ల‌క్ష్మీ రాయ్‌, శ‌క్తి క‌పూర్‌‌తోపాటు అనూప్‌ సోని, ప్ర‌దీప్‌ రావ‌త్‌, దీక్షా పంత్‌, అమ‌న్ ప్రీత్‌ సింగ్, భోపాల్‌, విజ‌య్‌భాస్క‌ర్‌, మిర్చి మాధ‌వి త‌ద‌త‌రులు న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజేంద్ర భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాయ్ లక్ష్మీ ముందు పేరు లక్ష్మీ రాయ్. ఆమె లక్ష్మీ రాయ్‌గానే తెలుగు సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరో శ్రీకాంత్‌కు జోడీగా కాంచనమాల కేబుల్ టీవీ మూవీతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయం అయింది లక్ష్మీ రాయ్. అయితే ఈ సినిమా అంతగా క్లిక్ కాలేదు. దాంతో హీరోయిన్‌గా లక్ష్మీ రాయ్‌కి అంత సాలిడ్ ఎంట్రీ దక్కలేదు. అనంతరం చేసిన సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేకపోయాయి.

హీరోయిన్‌గా పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి లక్ష్మీ రాయ్ పలు స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. ముందుగా రవితేజ బలుపు మూవీలో లక్కీ రాయ్ అనే పాటతో ఐటమ్ సాంగ్ చేయడం ప్రారంభించింది. ఈ పాట చాలా బాగా హిట్ అయింది. అనంతరం ఆమెకు ఐటమ్ సాంగ్స్ ఆఫర్సే ఎక్కువగా వచ్చాయి. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీలో రత్తాలు అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

IPL_Entry_Point