Ra Macha Macha Song Lyrics: రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో రా మచ్చ మచ్చ.. చిరు వీణ స్టెప్ రీక్రియేట్.. లిరిక్స్ ఇవే
Ra Macha Macha Song: రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రా మచ్చ మచ్చ సాంగ్ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. వేల మంది డ్యాన్సర్లతో కలిసి చరణ్ చేసిన డ్యాన్స్ ఈ పాటకు హైలైట్ గా చెప్పొచ్చు.
Ra Macha Macha Song: రా మచ్చ మచ్చ అంటూ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆసక్తికరంగా చూస్తున్న రామ్ చరణ్ అభిమానులను.. ఈ పాట ఆనందానికి గురి చేస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ ఈ పాట వచ్చేసింది. ఈ మధ్యే ప్రోమో రిలీజ్ చేయగా.. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 30) లిరికల్ వీడియో వచ్చింది.
రా మచ్చ మచ్చ సాంగ్
రా మచ్చ మచ్చ సాంగ్ మాస్ బీట్ తో ఎంతో ఉత్సాహంగా సాగిపోయింది. రామ్ చరణ్ తోపాటు ఈ పాటలో వేల మంది డ్యాన్సర్లు, కమెడియన్ సత్య, ప్రియదర్శిలాంటి వాళ్లు కూడా కనిపించారు. చాలా రోజుల తర్వాత చరణ్ సోలో స్టెప్పులు చూసే అవకాశం అభిమానులకు దక్కింది. ఇక అందరూ అంచనా వేసినట్లే ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది.
ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఇక నకాల్ అజీజ్ ఈ పాట పాడాడు. ఇందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులను కొరియోగ్రాఫ్ చేసింది ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. ఈ పాటలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక దమ్ తు దిఖాజా అంటూ హిందీతోపాటు తమిళంలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు.
గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ కాగా.. ఎస్‌జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరాం, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట లిరిక్స్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. మచ్చ మచ్చ అంటూ రచ్చ చేసేయండి.
రా మచ్చ మచ్చ సాంగ్ లిరిక్స్ ఇవే
కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే..
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే..
టక్ టై తీస్తే నీలాంటి వాడ్నే..
నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే..
కన్న ఊర్లో కాలెట్టానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే..
మాటలన్నీ చేతల్లో పెడితే, మీరైనా నాలాంటోళ్లే
రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలోచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ ర
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా
నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గలా..
చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా..
వీణ స్టెప్పు వేస్తేనీ
విజిల్ సౌండు దడ దడా
నక్కినదండి గుండెలో ఏదో మూల..
పోచమ్మ జాతరలో తప్పెటగుళ్లు
అరె సంక్రాంతి ఇళ్లలో పందెం కోళ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు
ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే
ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారంటే మీరైనా నాలాంటోళ్లే..