Pushpa Songs: యూట్యూబ్‌లో పుష్ప పాటల రికార్డు.. ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా?
Pushpa Songs: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలుసు కదా. ఇప్పుడా మూవీ పాటలు కూడా యూట్యూబ్‌లో రికార్డు సృష్టించాయి.
పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఓ కొత్త లుక్‌లో చూపించిన పుష్ప పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. ఆ మూవీలో బన్నీ మేనరిజాలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ చివర్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.
పుష్ప హిట్ కావడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ మూవీని మరింత భారీ బడ్జెట్‌తో చాలా గ్రాండ్‌గా తీసుకురావడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే పుష్ప మూవీ హిట్ కావడంలో అందులోని పాటలు కీ రోల్ పోషించాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆల్బమ్ ఫ్యాన్స్‌ను చాలా ఆకట్టుకుంది.
యూట్యూబ్‌లో ఈ పాటలను పదేపదే విన్నారు. దీంతో ఈ ఆల్బమ్ కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రికార్డు అది. పుష్ప ఆల్బమ్‌కు ఇప్పటి వరకూ మొత్తంగా 500 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఇది చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, నా సామి, ఊ అంటావా మావాలాంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పుష్ప కంటే ముందు వచ్చిన అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురంలో సాంగ్స్ కూడా యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాయి. ఆ పాటలు కూడా బాగా పాపులర్ కావడంతో కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆ మ్యూజిక్‌ను థమన్ అందించాడు. ఇన్నాళ్లూ తన డ్యాన్స్ మూవ్స్‌తోనే ఆకట్టుకున్న బన్నీ.. ఇప్పుడిలా తన మూవీ ఆల్బమ్స్‌తోనే ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటున్నాడు.
సంబంధిత కథనం