Pushpa 2 Trailer Record: పుష్ప 2 ట్రైలర్ రికార్డు.. అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న ఇండియా సినిమా ఇదే
Pushpa 2 Trailer Record: పుష్ప 2 మూవీ ట్రైలర్ ఊహించినట్లే రికార్డులు తిరగరాస్తోంది. రిలీజై 24 గంటల్లోనే పది కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
Pushpa 2 Trailer Record: అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీ ట్రైలర్ ఆదివారం (నవంబర్ 17) రిలీజైన విషయం తెలుసు కదా. ఈ మూవీ ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ట్రైలర్ రిలీజ్ కాగానే ఎగబడి చూసేశారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడీ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24 గంటలు కూడా కాకముందే పది కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
పుష్ప 2 ట్రైలర్ రికార్డు
సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. దీంతో ఈసారి వెరైటీగా ట్రైలర్ లాంచ్ కోసం బీహార్ రాజధాని పాట్నాను ఎంచుకుంది ఈ మూవీ టీమ్. ఈ లాంచ్ ఈవెంట్ చూడటానికి ఫ్యాన్స్ వెల్లువలా వచ్చారు. ఏదో తెలుగు రాష్ట్రాల్లో అవుతున్న ఈవెంట్ లా పాట్నాలోనూ తరలి వచ్చిన అభిమానులను చూసి మూవీ టీమ్ కూడా షాక్ అయింది.
ఇక పుష్ప 2 ట్రైలర్ విషయానికి వస్తే.. అభిమానుల అంచనాలకు తగినట్లు ఉండటంతో 24 గంటల్లోపే అన్ని భాషల్లో కలిపి 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇండియాలో ఓ మూవీ ట్రైలర్ ఇంత వేగంగా పది కోట్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి అని మేకర్స్ వెల్లడించారు.
"పుష్ప తలవంచడు.. అంతేకాదు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడం కూడా ఆపడు.. అత్యంత వేగంగా పది కోట్లకుపైగా వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా పుష్ప 2 ట్రైలర్ నిలిచింది" అనే క్యాప్షన్ తో పుష్ప మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
2 నిమిషాల 48 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌లో కథని ఏమాత్రం రివీల్ చేయని దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్‌కి విపరీతమైన ఎలివేషన్ ఇస్తూ సినిమాపై హైప్‌ని మరింత పెంచేశారు.
పుష్ప-2లో అనసూయ, సునీల్‌తో పాటు కొత్తగా జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ కూడా యాడ్ అయ్యారు. అలానే శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. కాదు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్‌లో అల్లు అర్జున్ చేసిన సందడి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పోతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్, రష్మికతోపాటు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయలాంటి వాళ్లు నటిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.