Pushpa 2 Theatrical Rights: సలార్ కంటే ఎక్కువే.. పుష్ప 2 థియేట్రికల్ హక్కులకు ఎంతంటే?
Pushpa 2 Theatrical Rights: ఈ ఏడాది రానున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఒకటైన పుష్ప 2 థియేట్రికల్ హక్కులపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కుల కోసం మేకర్స్ భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Pushpa 2 Theatrical Rights: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ మూవీ 2024లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఒకటి. ఈ సినమా ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీ థియేట్రికల్ హక్కుల కోసం మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
ఈ సీక్వెల్‌కి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ఇంత భారీ మొత్తం అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఇంత మొత్తం చెల్లించి హక్కులు పొందడానికి బయర్లు సిద్ధంగా లేనట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్ట్ వెల్లడించింది. పుష్ప 2కి ఉన్న క్రేజ్ చూస్తే.. భారీ ఓపెనింగ్స్ ఖాయం. అయినా రిస్క్ తీసుకోకూడదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి సలార్ మూవీని భారీ మొత్తానికి కొన్నా.. నైజాం తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు. ఆ ప్రాంతాల్లో బ్రేక్ఈవెన్ రావడం అనుమానమే. మరోవైపు మూడేళ్ల కిందట రిలీజైన పుష్ప మూవీ ఇండియాలో మొత్తంగా రూ.250 కోట్లకుపైగా నెట్ వసూళ్లు సాధించినా.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్లు ఏమీ రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీ బెల్ట్‌లోనే పుష్పను ఎక్కువగా ఆదరించారు. ఈ రెండు కారణాల వల్ల బయర్లు పుష్ప 2కి భారీ మొత్తం చెల్లించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నైజాం ఏరియా వరకూ కాస్త రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. ఏపీలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం అంత భారీ వసూళ్లు అనుమానమే. దీంతో మేకర్స్ ఆ ప్రాంతాల్లో డిమాండ్ చేస్తున్న రూ.100 కోట్ల విషయంలోనే వాళ్లు వెనుకడుగు వేస్తున్నారు. నైజాం ప్రాంతంలో ఇది రూ.75 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.