Pushpa 2: మరో మైల్‍స్టోన్ దాటిన పుష్ప 2 సాంగ్.. రిలీజ్ డేట్‍పై క్లారిటీ ఇచ్చిన టీమ్.. పక్కానే కదా అంటున్న నెజిజన్లు
Pushpa 2 The Rule: పుష్ప 2 చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన ‘పుష్ప..పుష్ప’ పాట చాలా పాపులర్ అయింది. ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్‍లో ఓ మైల్‍స్టోన్ దాటింది. మూవీ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడటంతో చాలా మంది నిరాశ చెందారు. అయితే, అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు అంటూ వచ్చిన పుకార్లతో డిసెంబర్‌లో అయినా ఈ చిత్రం వస్తుందా అనే భయం పట్టుకుంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన తొలి సాంగ్ ‘పుష్ప.. పుష్ప’ తాజాగా మరో మైలురాయి దాటింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 30) వెల్లడించింది.
150 మిలియన్ల వ్యూస్ దాటి..
‘పుష్ప.. పుష్ప’ పాట లిరికల్ వీడియోకు అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్‍లో తాజాగా 150 మిలియన్ల వ్యూస్ దాటాయి. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నేడు ప్రకటించింది. వరల్డ్ వైడ్ చార్ట్‌బస్టర్ ‘పుష్ప.. పుష్ప’ యూట్యూబ్‍లో 150 మిలియన్ల వ్యూస్ దాటిందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. 2.5 మిలియన్ లైక్స్ దాటాయని పేర్కొంది.
తెలుగును మించి హిందీలో..
పాన్ ఇండియా బ్లాక్‍బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2 చిత్రానికి తెలుగుతో పాటు హిందీలోనూ ఫుల్ హైప్ ఉంది. ఈ సినిమా పాటల విషయంలోనే ఇది అర్థమవుతోంది. ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ హిందీ లిరికల్ వీడియోకు యూట్యూబ్‍లో ఇప్పటి వరకు సుమారు 71 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో 58 మిలియన్ వ్యూస్ దక్కాయి. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి వ్యూస్ దక్కించుకుంది. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సాంగ్ యూట్యూబ్‍లో ఇప్పడు 150 మిలియన్ల వ్యూస్ దాటింది.
పుష్ప 2 నుంచి ఈ టైటిల్ సాంగ్ మే 1వ తేదీన రిలీజైంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ మంచి మాస్ బీట్ ఇచ్చారు. ఈ లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ హుక్ స్టెప్స్ బాగా వైరల్ అయ్యాయి. క్రేజ్ కూడా విపరీతంగా ఉండటంతో భారీ వ్యూస్ దక్కించుకుంది.
రిలీజ్ పక్కానే కదా?
పుష్ప సాంగ్‍పై ఈ అప్‍డేట్‍తో పాటు రిలీజ్ డేట్‍ను కూడా మూవీ టీమ్ పేర్కొంది. డిసెంబర్ 6వ తేదీన ఈ చిత్రం వస్తుందని తెలిపింది. పుష్ప 2 మళ్లీ వాయిదా పడుతుందని ఇటీవల వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. అయితే, ఈసారైనా రిలీజ్ పక్కానే కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలాగైనా డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని, చాలా వేచిచూస్తున్నామంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
జోరుగా షూటింగ్
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో మళ్లీ మొదలైంది. యూరప్ వెకేషన్ నుంచి అల్లు అర్జున్ కూడా తిరిగి వచ్చేశారు. ఆగస్టు తొలి వారంలోనే మళ్లీ ఆయన షూటింగ్‍లో పాల్గొననున్నారు. అక్టోబర్ కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు.