Pushpa 2 Pre Release Business: పుష్ప 2 సినిమాకు రికార్డుస్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్.. లెక్కలు ఇలా!-pushpa 2 the rule pre release business crosses 1000 crore mark theatrical ott digital streaming rights and more ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Pre Release Business: పుష్ప 2 సినిమాకు రికార్డుస్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్.. లెక్కలు ఇలా!

Pushpa 2 Pre Release Business: పుష్ప 2 సినిమాకు రికార్డుస్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్.. లెక్కలు ఇలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 21, 2024 08:12 PM IST

Pushpa 2 The Rule Pre-Release Business: పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏకంగా రూ.1000కోట్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. చాలా విషయాల్లో రికార్డులను సృష్టించింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇక్కడ చూడండి.

Pushpa 2 Pre Release Business: పుష్ప 2 సినిమాకు రికార్డుస్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్.. లెక్కలు ఇలా!
Pushpa 2 Pre Release Business: పుష్ప 2 సినిమాకు రికార్డుస్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్.. లెక్కలు ఇలా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీకి దేశవ్యాప్తంగా ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా రేంజ్‍లో బంపర్ బ్లాక్ బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్‍గా మూడేళ్ల తర్వాత ఈ చిత్రం వస్తోంది. దీంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఫుల్ హైప్ ఉన్న ఈ మూవీకి ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఏకంగా రూ.1,000కోట్లను దాటేసింది. ఆ వివరాలు ఇవే..

రూ.1000కోట్లను క్రాస్ చేసి..

పుష్ప 2 సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగింది. ఏకంగా రూ.1,065 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. థియేట్రికల్, ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్, మ్యూజిక్, శాటిలైట్ హక్కులు కలిపి మొత్తంగా ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ వ్యాపారం సాగింది.

థియేట్రికల్ హక్కుల లెక్కలు ఇలా..

పుష్ప 2 సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.220కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఉత్తరాది థియేట్రికల్ హక్కులకు ఏకంగా రూ.200కోట్లు దక్కాయి. ఏ బాలీవుడ్ మూవీ కూడా చేయని విధంగా హిందీలో పుష్ప 2కు రికార్డు స్థాయి ధర సొంతమైంది. తమిళనాడులో రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30కోట్లు, కేరళలో రూ.20 కోట్లు థియేట్రికల్ హక్కుల ద్వారా బిజినెస్ జరిగిందని సమాచారం. ఓవర్సీస్‍ థియేట్రికల్ హక్కులు రూ.120కోట్లకు అమ్ముడయ్యాయి. ఇలా మొత్తంగా పుష్ప 2 చిత్రానికి థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.640కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఓటీటీ, మ్యూజిక్, శాటిలైట్ ఇలా..

పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఏకంగా రూ.275కోట్లకు దక్కించుకుంది. ఇండియాలో స్ట్రీమింగ్ హక్కుల ద్వారా అత్యధిక మొత్తం డీల్ జరిగిన మూవీగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ఈ సినిమా మ్యూజిక్ హక్కులకు రూ.65 కోట్లు, శాటిలైట్ హక్కులను రూ.85కోట్లు దక్కాయి. ఇలా.. అన్నీ కలిపి పుష్ప 2 సినిమాకు సుమారు రూ.1,065 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది.

ప్రీ-రిలీజ్ బిజినెస్‍లోనే రూ.1000కోట్ల మార్క్ దాటేసి పుష్ప 2 సినిమా రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి తిరుగులేని క్రేజ్ ఉంది. డిసెంబర్ 6వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఒక రోజు ముందు కూడా రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రమోషన్లను భారీగా చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.

పుష్ప 2 సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. ఇప్పటికే ఫస్టాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయి లాక్ అయినట్టు మేకర్స్ ఇటీవలే అప్‍డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Whats_app_banner