Pushpa 2 Teaser Release Date: పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
Pushpa 2 Teaser Release Date: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా టీజర్ వచ్చేస్తోంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
Pushpa 2 The Rule Teaser Date: పుష్ప 2: ది రూల్ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దేశమంతా ఈ సినిమా కోసం వేచిచూస్తోంది. 2021లో ‘పుష్ప 1: ది రైజ్’తో సెన్సేషనల్ హిట్ కొట్టి పాన్ ఇండియా రేంజ్‍లో స్టార్ అయ్యారు అల్లు అర్జున్. పుష్ప రాజ్‍గా ఫేమస్ అయ్యారు. ఆ చిత్రానికి సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2పై అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ అప్‍డేట్ల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప 2: ది రూల్ టీజర్ రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది.
పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్
పుష్ప 2 సినిమా టీజర్‌ను ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని టీమ్ నేడు (ఏప్రిల్ 2) అధికారికంగా ప్రకటించింది. టీజర్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఓ పోస్టర్ షేర్ చేసింది.
ఈ నయా పోస్టర్‌లో గజ్జెలు ధరించిన కాలు ఉంది. జాతర సీక్వెన్సులో అల్లు అర్జున్‍కు సంబంధించిన కాలు ఇది. వెనుక దీపాలు వెలుగుతుండగా.. నేలమీద పడిన కుంకుమపై కాలు మోపినట్టు ఈ పోస్టర్‌లో ఉంది. దీంతో టీజర్లో ఎక్కువగా జాతర యాక్షన్ సీక్వెన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే, పుష్ప మాస్ జాతర మొదలైందంటూ ఈ టీజర్ రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటించింది.
“పుష్ప మాస్ జాతరను మొదలుపెడదాం. ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ఏప్రిల్ 8వ తేదీన రానుంది. ఫైర్‌ను డబుల్ చేసేందుకు అతడు వచ్చేస్తున్నాడు” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుందని స్పష్టం చేసింది.
వేగంగా షూటింగ్
పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ప్రకటించిన తేదీకి మూవీని విడుదల చేసేలా శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే వైజాగ్‍లో షెడ్యూల్ పూర్తవగా.. ప్రస్తుతం హైదరాబాద్‍లో షూటింగ్ జరుగుతోంది. భారీస్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్‍గా చేస్తున్నారు. జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రామేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పుష్ప 2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.