Pushpa 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలో పుష్పగాడి రూల్.. స్ట్రీమింగ్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో తెలుసా!
Pushpa 2 OTT: పుష్ప 2 చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ సమీపించింది. రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం అడుగుపెట్టనుంది.
పుష్ప 2: ది రూల్ చిత్రం బాక్సాఫీస్‍ను ఏలేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ మూవీ బంపర్ వసూళ్లతో అదరగొట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల డిసెంబర్ 5న రిలీజై చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఇటీవలే రీలోడెడ్ వెర్షన్ కూడా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ బ్లాక్‍బస్టర్ పష్ప 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు రానుండగా.. ప్రేక్షకుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.

స్ట్రీమింగ్ ఎక్కడ!
పుష్ప 2: ది రూల్ చిత్రం రేపు (జనవరి 30) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఆ అర్ధరాత్రే అందుబాటులోకి వస్తుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయవచ్చు. రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు నెట్‍ఫ్లిక్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప 2 ఇప్పుడు స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీ వెర్షన్ ఆలస్యం కానుంది. స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్‍లోనూ హిందీని నెట్‍ఫ్లిక్స్ పేర్కొనలేదు.
స్ట్రీమింగ్ హక్కుల ధరలోనూ రికార్డే
పాన్ ఇండియా బ్లాక్‍బాస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వచ్చిన పుష్ప 2 చిత్రంపై ముందు నుంచే భారీ క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా హైప్ విపరీతంగా నెలకొంది. దీంతో పుష్ప 2కు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ద్వారా రికార్డుస్థాయిలో భారీ ధర దక్కింది. సుమారు రూ.275 కోట్లకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. రిలీజ్ కాకముందే ఈ స్థాయి భారీ రేటుతో రైట్స్ తీసుకుంది. ఓటీటీ హక్కుల ద్వారా అత్యధిక ధర దక్కించుకున్న ఇండియన్ మూవీగా పుష్ప 2 రికార్డు కూడా క్రియేట్ చేసింది.
పుష్ప 2 మూవీ రీలోడెడ్ వెర్షన్ జనవరి 17న థియేటర్లలోకి వచ్చింది. సుమారు 20 నిమిషాల అదనపు ఫుటేజ్‍తో అడుగుపెట్టింది. ఈ రీలోలెడ్ వెర్షన్‍కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. 3 గంటల 44 నిమిషాల రన్‍టైమ్ ఉంటుందని నెట్‍ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది.
పుష్ప 2 కలెక్షన్లు
పుష్ప 2 చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనా. 32 రోజల్లో రూ.1830 కోట్లు అంటూ ఓ పోస్ట్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు దక్కిందంటూ వెల్లడించింది. ఆ తర్వాత కలెక్షన్లపై అప్‍డేట్ ఇవ్వలేదు. భారత్‍లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న రికార్డు పుష్ప 2 ఖాతాలో పడింది. బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ హిట్‍గా అగ్రస్థానంలో నిలువడంతో పాటు మరిన్ని రికార్డులను ఈ చిత్రం క్రియేట్ చేసింది.
పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించగా.. ఫాహద్ ఫాజిల్ నెగెటివ్ రోల్ చేశారు. జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, జగదీశ్ కీలకపాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూజ్ చేసిన ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సామ్ సీఎస్ ఇచ్చారు.
సంబంధిత కథనం