Pushpa 2 Collection: పుష్ప 2కి ఒక్కరోజులోనే 12 కోట్లు.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే! బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయాలంటే?-pushpa 2 the rule 24 days world wide collection and allu arjun movie need 70 cr to break baahubali 2 gross record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Collection: పుష్ప 2కి ఒక్కరోజులోనే 12 కోట్లు.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే! బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయాలంటే?

Pushpa 2 Collection: పుష్ప 2కి ఒక్కరోజులోనే 12 కోట్లు.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే! బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయాలంటే?

Sanjiv Kumar HT Telugu

Pushpa 2 The Rule 24 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు కలెక్షన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు 24వ రోజున ఇండియాలో రూ. 12 కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్‌కు 24 రోజుల్లో వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

పుష్ప 2కి ఒక్కరోజులోనే 12 కోట్లు.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే! బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయాలంటే? (X)

Pushpa 2 Worldwide Box Office Collection Day 24: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలో కూడా సత్తా చాటుతోంది. థియేటర్‌లోకి వచ్చిన నాలుగో శనివారం అంటే డిసెంబర్ 28న ఇండియాలో కలెక్షన్లు భారీగా పెరిగాయి.

భారీగా పెరిగిన కలెక్షన్స్

పుష్ప 2 ది రూల్ సినిమాకు 24వ రోజున ఇండియాలో రూ. 12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ అంటే ఒక్కరోజులోనే వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. వీటిలో తెలుగు నుంచి రూ. 2.1 కోట్లు, హిందీలో 10 కోట్లు, తమిళం నుంచి 35 లక్షలు, కర్ణాటక ద్వారా 4, మలయాళం నుంచి లక్ష వచ్చినట్లుగా లెక్కలు చూపించింది. ఇప్పటికీ హిందీలోనే కలెక్షన్స్ రావడం విశేషం. అయితే, 23వ రోజుతో పోలిస్తే 24వ రోజు దేశీయ కలెక్షన్స్ 42.86 శాతం భారీగా పెరిగాయి.

హిందీలోనే ఎక్కువ

ఇక 24 రోజుల్లో ఇండియాలో పుష్ప 2 సినిమాకు రూ. 1141.35 కోట్లు నెట్ వచ్చినట్లు సమాచారం. ఇందులో తెలుగులో 322.23 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి 741.15 కోట్లు, తమిళం నుంచి 56.3 కోట్లు, కర్ణాటక నుంచి 7.57 కోట్లు, మలయాళం ద్వారా 14.1 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

మేకర్స్‌ది మరో మాట

కాగా, పుష్ప 2 చిత్రం భారతదేశంలో (నెట్) రూ. 1141.35 కోట్లు వసూలు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1597 కోట్లు వసూలు చేసిందని ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ తెలిపింది. అయితే, పుష్ప 2 మేకర్స్ మాత్రం ఈ సినిమా 22వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు దాటిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌తో తెలియజేశారు.

ఫైనల్ డేటా కన్ఫర్మ్ అయితేనే

అంటే, బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చేరుకున్నట్లే. మరికొంత కాలం తర్వాత ఫైనల్ వసూళ్ల డేటా కన్ఫర్మ్ అయితే బాహుబలి 2 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్‌ను పుష్ప 2 బ్రేక్ చేసిందా లేదా అనేది తెలుస్తుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది.

22 రోజుల్లోనే

అలాగే, డిసెంబర్ 28వ తేదీ అంటే 24వ రోజు వరకు పుష్ప ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ.1597 కోట్లు వసూలు చేసింది. మూవీ మేకర్స్ ప్రకారం డిసెంబర్ 28న వసూళ్లు బాహుబలి 2 వరల్డ్ వైడ్ రికార్డ్ వసూళ్లకు దగ్గరగా ఉంటాయి. కానీ, పుష్ప 2 ది రూల్ 22 రోజుల్లోనే రూ. 1719 కోట్లు వసూలు చేసిందని మైత్రీ మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.

మరో 70 కోట్లు

బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 1788.06 కోట్లు. బాలీవుడ్ మూవీ దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.2000 కోట్లు. అంటే, దంగల్ తర్వాత అత్యధికి వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2. పుష్ప ది రూల్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (ఇప్పటివరకు రిపోర్ట్) రూ.1719 కోట్లు. రాజమౌళి సినిమా రికార్డును బద్దలు కొట్టాలంటే అల్లు అర్జున్ యాక్షన్ డ్రామాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.70 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.