Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప 2 టీమ్ - అల్లు అర్జున్ మిస్!
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవిని పుష్ప 2 టీమ్ కలిసింది. పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు నిర్మాతలు రవిశంకర్, నవీన్ గురువారం చిరంజీవిని ఆయన ఇంట్లో కలిశారు. అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి ఇంటికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని పుష్ప 2 టీమ్ కలిసింది. పుష్ఫ 2 రిలీజ్ సందర్భంగా గురువారం చిరంజీవిని ఆయన ఇంట్లో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు.
అల్లు అర్జున్ లేకుండానే పుష్ప డైరెక్టర్, నిర్మాతలు చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ కావాలనే వారితో పాటు చిరంజీవి ఇంటికి రాలేదా...లేదంటే బిజీగా ఉండి మిస్ అయ్యారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
పుకార్లకు బలం...
కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 టీమ్‌తో కలిసి చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ రాకపోవడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. పుష్ప 2 మూవీని చిరంజీవి ఇంకా చూడలేదని తెలిసింది. సుకుమార్‌తో పాటు నిర్మాతలు తనను కలిసిన నేపథ్యంలో పుష్ప 2 చిరంజీవి చూస్తాడా...ఈ సినిమా గురించి ఎలా స్పందిస్తాడన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
సాయిధరమ్‌తేజ్ మినహా...
పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్‌తేజ్ మినహా మిగిలిన హీరోలు ఎవరూ ట్వీట్స్ చేయలేదు. కొన్నాళ్లుగా చిన్న సినిమాలకు సైతం సపోర్ట్‌గా నిలుస్తూ వస్తోన్న చిరంజీవి కూడా ఇప్పటివరకు పుష్ప 2 ప్రస్తావనను ఎప్పుడు, ఎక్కడ తీసుకురాకపోవడం గమనార్హం.
నాగబాబు ట్వీట్...
బుధవారం రోజు పుష్ప 2 రిలీజ్‌ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషీయన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా.
ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో పుష్ప 2 తో పాటు అల్లు అర్జున్ పేరును నాగబాబు మాత్రం ప్రస్తావించలేదు.
రామ్‌చరణ్‌తో
పుష్ప 2 తర్వాత తన తదుపరి సినిమాను రామ్‌చరణ్‌తో చేయబోతున్నాడు సుకుమార్. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ స్వయంగా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 17వ మూవీ ఇది.