Pushpa 2 Rights: పుష్ప 2కు రూ.1000 కోట్ల ఆఫర్.. క్రేజ్ మామూలుగా లేదుగా!-pushpa 2 rights may fetch makers 1000 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Rights: పుష్ప 2కు రూ.1000 కోట్ల ఆఫర్.. క్రేజ్ మామూలుగా లేదుగా!

Pushpa 2 Rights: పుష్ప 2కు రూ.1000 కోట్ల ఆఫర్.. క్రేజ్ మామూలుగా లేదుగా!

Hari Prasad S HT Telugu
Sep 04, 2023 10:20 PM IST

Pushpa 2 Rights: పుష్ప 2కు రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చిందట. ఈ మూవీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. మొత్తం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆ సంస్థ దక్కించుకోవడానికి చూస్తోంది.

పుష్ప ది రూల్
పుష్ప ది రూల్

Pushpa 2 Rights: పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమా పుష్ప ది రూల్. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప కోసం అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.

అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఉత్తరాదికి చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఎంతలా అంటే.. సినిమా మొత్తం హక్కుల కోసం రూ.1000 కోట్లు చెల్లిస్తామని ఆ సంస్థ ఆఫర్ ఇవ్వడం విశేషం. పుష్ప ది రూల్ మూవీకి ఏ స్థాయి క్రేజ్, బజ్ క్రియేటయ్యాయో చెప్పడానికి ఇదే నిదర్శనం.

అయితే ఇంత పెద్ద ఆఫర్ వచ్చినా సినిమా మేకర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. మరింత పెద్ద డీల్ కోసం వాళ్లు చూస్తున్నట్లు సమాచారం. పుష్ప 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఏకంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం. ఫస్ట్ పార్ట్ అంతగా అంచనాలు లేకుండా రిలీజైంది.

కానీ అది కాస్తా అంచనాలకు మించి హిట్ అవడంతో ఇప్పుడు సీక్వెల్ కు రెట్టింపు ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకే కాదు.. ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం కూడా గట్టి పోటీయే ఉంది. వచ్చే ఏడాది మార్చి 22న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు అల్లు అర్జున్ ఈ మధ్యే అభిమానులను పుష్ప 2 ప్రపంచంలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ తో కలిసి అతడు చేసిన ఓ వీడియోలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్, షూటింగ్ జరుగుతున్న తీరును బన్నీ అభిమానులకు వివరించాడు.

Whats_app_banner