Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ గురించి మళ్లీ జోరుగా చర్చ.. ఓటీటీ రైట్స్‌ను ఏ ప్లాట్‌ఫామ్.. ఎంత ధరకి కొనుగోలు చేసిందంటే?
Pushpa 2 OTT platform: పుష్ప 2 మూవీ రిలీజ్‌కి ఇక నాలుగు రోజులే సమయం ఉంది. అయితే.. అనూహ్యంగా రిలీజ్ డేట్ గురించి కాకుండా పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లోకి రానుంది? అని నెటిజన్లు శోధిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే?
Pushpa 2 OTT release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మేనియా మొదలైపోయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఆరు భాషల్లో దాదాపు 12,000 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగించేస్తుండగా.. మూవీ టికెట్ల రేట్ల గురించి కూడా జోరుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
టికెట్ల ధరకి భయపడి.. ఓటీటీ కోసం వెతుకులాట
2021లో ‘పుష్ప : ది రైజ్’మూవీ రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దాంతో .. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి సీక్వెల్‌గా వస్తున్న పుష్ఫ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 టికెట్ రేటుతో సంబంధం లేకుండా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో పుష్ప 2 టికెట్ల ధర రూ.1500 దాటిపోగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.800-1000 పలుకుతోంది. దాంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది? అని నెటిజన్లు శోధిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రచారం
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అలానే క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, ఐటెం సాంగ్ మూవీపై అంచనాల్ని పెంచేశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్, రష్మిక మంధాన బిజీగా ఉన్నారు.
అమెజాన్ పోటీపడినా..
పుష్ప 2కి బాగా బజ్ ఏర్పడటంతో.. ఓటీటీ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గట్టిగానే పోటీపడ్డాయి. అమెజాన్‌తో ఆఖరి వరకూ పోటీపడిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. అమెజాన్ కోట్ చేసిన ధరకి మూడు రెట్లు అధికంగా నెట్‌ఫ్లిక్స్ కోట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం పుష్ప 2 ఓటీటీ రైట్స్‌ను రూ.275 కోట్లకి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ రూ.175 కోట్ల రికార్డ్ బద్ధలైంది. పుష్ప 1 సినిమాని అప్పట్లో అమెజాన్ రూ.30 కోట్లకి దక్కించుకున్న విషయం తెలిసిందే.
పుష్ప 2 ఓటీటీలోకి ఎప్పుడు?
డిసెంబరు 5న పుష్ప 2 మూవీ థియేటర్లలోకి రాబోతోంది. సాధారణంగా సినిమా రిలీజైన 4-6 వారాల మధ్య ఓటీటీలోకి వస్తుంటుంది. కొన్ని సినిమాలు 10-14 రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. అయితే.. పుష్ప 2కి ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఓటీటీలోకి రావడానికి కనీసం 2 నెలలైనా సమయం పట్టే అవకాశం ఉంటుంది.