Pushpa 2 on Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప 2 దూకుడు మామూలుగా లేదు.. నాలుగు రోజుల్లోనే రికార్డు వ్యూస్
Pushpa 2 on Netflix: పుష్ప 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2లాంటి సినిమానే వెనక్కి నెట్టిన ఈ అల్లు అర్జున్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ తన మ్యాజిక్ రిపీట్ చేస్తోంది.
Pushpa 2 on Netflix: పుష్ప 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్.. ఆ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టగానే ఎగబడి చూసేస్తున్నారు. జనవరి 30న ఈ మూవీ ఓటీటీలోకి రాగా.. మొదటి నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో రెండో స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 దూకుడు
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పుష్ప 2 మూవీ డిజిటల్ హక్కులను ఏకంగా రూ.250 కోట్లకు కొనుగోలు చేసిందన్న విషయం తెలుసు కదా. ఆ అంచనాలను తగినట్లే ఈ సినిమా ఆ ఓటీటీలో దూసుకెళ్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అది కూడా కేవలం తెలుగు వెర్షనే కావడం విశేషం.
పుష్ప 2 తెలుగు వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లో నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో రెండో స్థానంలో ఉంది. ఇక బుధవారం (ఫిబ్రవరి 5) ట్రెండింగ్ విషయానికి వస్తే ఇండియాలో తొలి స్థానంలో కొనసాగుతోంది. అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1830 కోట్లకుపైనే వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ దూకుడు ఇప్పుడు ఓటీటీలోనూ కొనసాగుతోంది.
పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్
పుష్ప 2 మూవీ రీలోడెడ్ వెర్షెనే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంటే అదనంగా 22 నిమిషాలతో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో రన్ టైమ్ ఏకంగా 3 గంటల 44 నిమిషాలకు పెరిగింది. ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత వెస్టర్న్ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్, స్టంట్స్ వాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పుష్ప 2 నుంచి మార్వెల్ కూడా నేర్చుకోవాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప 2 మూవీని చూసి అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు చేసే మార్వెల్‍ను చాలా మంది విమర్శిస్తున్నారు. మార్వెల్ చిత్రాల్లో ఇటీవల క్రియేటివిటీ లోపిస్తోందని, ఇలాంటి సినిమాలు చూసైనా నేర్చుకోవాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 20వ సారి అదే సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించే బదులు పుష్ప 2 మూవీని చూసి హాలీవుడ్ నోట్స్ తీసుకోవాలని ఓ యూజర్ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం