Pushpa 2 Release : ఇది పుష్పగాడి రూలు.. పష్ప 2 ఆలస్యమవుతుందా?
Pushpa 2 Release : అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం రెండో దశ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మేలుకో పుష్ప అంటూ ట్వీట్స్ తో మోత మోగించారు.
నిజానికి బాహుబలి సినిమా(Bahubali) తర్వాత పాన్ ఇండియా సినిమాలుగా ప్రెజెంట్ చేయబడిన సౌత్ ఇండియన్ సినిమాలు చాలా తక్కువ. కానీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ బాక్సాఫీస్ విజయాన్ని సాధించొచ్చని పుష్ప సినిమా చూపించింది. కొవిడ్ తర్వాత విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని సక్సెస్ చూసింది. ఇక నార్త్ ప్రేక్షకులు అయితే.. పుష్ప క్యారెక్టర్ కు అడిక్ట్ అయిపోయారు.
ట్రెండింగ్ వార్తలు
సౌతిండియా సినిమాలపై నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు భారీ అంచనాలు క్రియేట్ చేసిన చిత్రం పుష్ప. ఆ తర్వాత కేజీఎఫ్ 2, కాంతార, ఆర్‌ఆర్‌ఆర్, విక్రమ్, సీతా రామమ్ వంటి కొన్ని సినిమాలు ఆ అంచనాలను సజీవంగా ఉంచాయి. సౌత్ ఇండియన్ సినిమా(South Indian Cinema)పై ఆశలు రేకెత్తించిన పుష్ప సినిమా రెండో భాగం రూపొందుతుండగా, మొదటి పార్ట్ కంటే ఎక్కువ శ్రద్ధతో, బడ్జెట్ తో గ్రాండ్ గా సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2022లో ప్రారంభమైంది. షూటింగ్ కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దర్శకుడు సుకుమార్(Director Sukumar) కథ, సినిమాటోగ్రఫీలో మార్పులు చేర్పులు చేయడంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. పుష్ప 2 ట్రైలర్ మూడు నెలల క్రితం విడుదలైంది. ట్రైలర్ చూసిన చాలా మంది సినిమా షూటింగ్ అయిపోయిందని అనుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, రెండో దశ షూటింగ్ ఇప్పుడే మొదలైంది.
ఈ చిత్రం రెండో దశ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో ప్రారంభమైంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ దగ్గర పడింది. కానీ పాటల షూటింగ్, కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. కొన్ని ఫైట్స్ కూడా చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సుమారు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉంది. దీంతో విడుదల ఆలస్యమవుతుందా అని చర్చ మెుదలుపెట్టారు బన్నీ ఫ్యాన్స్. ఇప్పటికే.. మేలుకో పుష్ప అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు. అల్లు అర్జున్(Allu Arjun)ను తెర మీద చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫహద్ పాసిల్, డాలీ ధనంజయ్ కూడా రెండో దశ షూటింగ్‌లో పాల్గొంటారని అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసిన తర్వాత, టీమ్ కొన్ని సన్నివేశాలను అవుట్‌డోర్‌లో షూట్ చేస్తుంది. ఆ తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రష్మిక మందన్న, ఫహద్ పాసిల్, డాలీ ధనంజయ్, అనసూయ, రావు రమేష్, సునీల్ ఇంకా పలువురు నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
టాపిక్