Pushpa 2 Glimpse: గుడ్ న్యూస్.. పుష్ప 2 గ్లింప్స్ వచ్చేది ఆ రోజే!-pushpa 2 glimpse to come out on april 8th on the occasion of allu arjun birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pushpa 2 Glimpse To Come Out On April 8th On The Occasion Of Allu Arjun Birthday

Pushpa 2 Glimpse: గుడ్ న్యూస్.. పుష్ప 2 గ్లింప్స్ వచ్చేది ఆ రోజే!

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Pushpa 2 Glimpse: గుడ్ న్యూస్.. పుష్ప 2 గ్లింప్స్ వచ్చేస్తోందని తాజాగా టాలీవుడ్ లో బజ్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గ్లింప్స్ తో సర్‌ప్రైజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Pushpa 2 Glimpse: టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమా పుష్ప: ది రూల్. 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప: ది రైజ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి, కేజీఎఫ్ ల సీక్వెల్స్ రేంజ్ లో పుష్ప సీక్వెల్ కూడా ఉంటుందని, ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చిన అభిమానులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ వస్తోందన్న వార్త ఫ్యాన్స్ ను తెగ ఆనందానికి గురి చేస్తోంది. నిజానికి అవతార్ 2 మూవీని ప్రదర్శించే థియేటర్లలోనే పుష్ప: ది రూల్ గ్లింప్స్ వేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఫైనల్ కట్ పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడట. అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా వాళ్లు ఆశించిన రేంజ్ లో ఈ గ్లింప్స్ ఉండటానికి సుకుమార్ కొత్త ప్లాన్ తో సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రామక్రిష్ణ వెల్లడించాడు. అంతేకాదు ఇప్పటికే పుష్ప 2 గ్లింప్స్ సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాడు.

ఈ గ్లింప్స్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ బజ్ క్రియేట్ అవుతోంది. గతడేది కేజీఎఫ్ 2 ఎవరూ ఊహించని సక్సెస్ సాధించిన తర్వాత పుష్ప సీక్వెల్ విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. మొదటి భాగంతోనే సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు సీక్వెల్ ను అంతకన్నా భారీగా చూపించడం సవాలే.

ఆ అంచనాలను సుకుమార్ ఎలా అందుకుంటాడన్నది ఆసక్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా ఫస్ట్ పార్ట్ కంటే చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేసినట్లు సమాచారం.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.