Pushpa 2 first single promo: పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది.. పుష్ప పుష్ప అంటూ..
Pushpa 2 first single promo: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
Pushpa 2 first single promo: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మధ్యే బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో
పుష్ప 2 మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందు ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను తీసుకురానున్నారు. దీనికి కూడా ముహూర్తం ఫిక్సయింది. బుధవారం (ఏప్రిల్ 24) సాయంత్రం 4.05 గంటలకు ఈ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.
ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం నాలుగు నెలల ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్లు మొదలు పెట్టారు. బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్న పుష్ప 2 సినిమా.. ఇప్పటికే నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు, డిజిటల్ హక్కుల రూపంలో రికార్డులు బ్రేక్ చేసింది.
ఇక పుష్ప పుష్ప అంటూ ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాగిపోనుంది. పూర్తి సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రోమో చివర్లో ఆ డేట్ రివీల్ చేయనున్నారు. పుష్ప సాంగ్స్ తో సంచలనం రేపిన దేవిశ్రీ ప్రసాదే ఈ సీక్వెల్ కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి అతడు ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
పుష్ప 2 రికార్డులు
పుష్ప 2 మూవీ రిలీజ్ కు ముందే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. నార్త్ లో థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.200 కోట్లు రాగా.. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.275 కోట్లు పెట్టి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఇక మిగతా భాషల థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ.270 కోట్లు రానున్నాయి. మొత్తంగా థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.550 కోట్లు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్, ఆడియో, శాటిలైట్, ఓవర్సీస్ హక్కులన్నీ కలిపితే రూ.వెయ్యి కోట్లు అవుతున్నాయి.
పుష్ప ది రైజ్ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని చెబుతున్నారు. మొత్తానికి పుష్ప మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడీ సీక్వెల్ తో పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.
టాపిక్