Pushpa 2 Run Time: పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే? - ఆర్ఆర్ఆర్, అర్జున్ రెడ్డి రికార్డులు బ్రేక్ చేయనున్న పుష్పరాజ్
Pushpa 2 Run Time: పుష్ప 2 రన్ టైమ్ ఎంతన్నది రివీలైంది. మూడు గంటల పది నిమిషాల రన్ టైమ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో చూపిస్తోంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ నవంబర్ 17న రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 రన్ టైమ్ ఎంతన్నది రివీలైంది. మూడు గంటల పది నిమిషాల రన్‌టైమ్‌తో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తెలుగు సినీ చరిత్రలో హయ్యెస్ట్ రన్‌టైమ్ మూవీస్‌లో ఒకటిగా పుష్ప 2 నిలవబోతున్నది.
ఆర్ఆర్ఆర్...
రన్ టైమ్ విషయంలో పుష్ప ది రూల్ మూవీ రాజమౌళి ఆర్ఆర్ఆర్, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలతో పాటు మహేష్‌బాబు నిజం సినిమాలను దాటేసింది. ఆర్ఆర్ఆర్, అర్జున్ రెడ్డి సినిమాలు మూడు గంటల ఆరు నిమిషాల రన్ టైమ్‌తో రిలీజయ్యాయి. మహేష్‌బాబు నిజం మూడు గంటల ఏడు నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల...
పుష్ప 2 మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సీక్వెల్‌లో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల కనిపించబోతున్నది. ఇటీవలే అల్లు అర్జున్, శ్రీలీలలపై హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో సుకుమార్ తెరకెక్కించారు.
వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ మూవీ ఇప్పటివరకు ఐదు కోట్ల వరకు ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టింది.
వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్...
పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లకుపైగా జరిగినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు అరు వందల కోట్లకు అమ్ముడుపోయినట్లు చెబుతోన్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు 400 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. పుష్ప 2 ఓటీటీ హక్కులను 275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంద
ఐదు వందల కోట్ల బడ్జెట్...
పుష్ప2లో మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్‌తో పాటు సునీల్, అనసూయ విలన్స్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను మాత్రం తమన్‌తో పాటు కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్‌సమకూర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతోనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల్ని ఈ ఇద్దరికి సుకుమార్ అప్పగించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. పుష్ప 2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు ఐదు వందల కోట్లతో ప్రొడ్యూస్ చేస్తోంది. పుష్ప ట్రైలర్‌ను నవంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాద్, ముంబాయి సహా ఇండియాలోని మరో ఐదు నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.
పార్ట్ 3 కూడా...
2021లో రిలీజైన పుష్ప ది రైజ్ మూవీ 400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. పార్ట్ 1 పెద్ద హిట్‌గా నిలవడంతో సీక్వెల్‌పై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ఫ్రాంచైజ్‌లో పార్ట్ 3 కూడా రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.