Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్లు కష్టమేనా! ఇంకా ఎంత దూరంలో ఉందంటే..-pushpa 2 box office day 32 collections allu arjun movie may not reach 2000 crore mark know why ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Box Office Collections Day 32: పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్లు కష్టమేనా! ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్లు కష్టమేనా! ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 06, 2025 08:08 AM IST

Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. అయితే, ఈ చిత్రం రూ.2వేలకోట్ల మార్క్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్లు కష్టమేనా! ఇంకా ఎంత దూరంలో ఉందంటే..
Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్లు కష్టమేనా! ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. చాలా రికార్డులను చెరిపివేస్తూ భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సీక్వెల్ చిత్రం అంతకు మించి సక్సెస్ సాధించి అదరగొట్టింది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 మూవీ ముందు నుంచి జోరు చూపింది. ఓ దశలో ఈ మూవీ రూ.2వేల కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు కనిపించాయి. అయితే, ఇప్పుడు ఇది సాధ్యమయ్యేలా లేదు.

yearly horoscope entry point

32 రోజుల్లో ఎంతంటే..

పుష్ప 2 చిత్రం ఇంకా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. 32వ రోజైన ఆదివారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.10కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్‍లో వసూళ్లు పెరిగాయి. దీంతో 32 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1820 కోట్ల కలెక్షన్లకు చేరుకుంది. ఈ క్రమంలో చాలా రికార్డునే బద్దలుకొట్టింది. ఫాస్టెస్ట్ రికార్డులను నమోదు చేసింది.

రూ.2వేల కోట్లు కష్టమే..

పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్ల మార్క్ ఇక కష్టంగానే కనిపిస్తోంది. ఈ మైలురాయి చేరాలంటే ఆ చిత్రానికి ఇంకా సుమారు రూ.180 కోట్ల వసూళ్లు రావాలి. ఇది దాదాపు అసాధ్యమే. ప్రస్తుతం ఏ చిత్రాలు పెద్దగా పోటీని ఇవ్వలేకపోవడం, హిందీలో బేబీజాన్ చతికిలపడటంతో పుష్ప 2కు వసూళ్లు మోస్తరుగా వస్తున్నాయి. అయితే, సంక్రాంతికి వరుస పెట్టి సినిమాలు రానున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ మరో నాలుగు రోజుల్లో జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 థియేటర్ల నుంచి వెళ్లిపోయే అవకాశాలు అధికం. హిందీ, తమిళంలోనూ గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్ తర్వాత రెండు రోజుల గ్యాప్‍లో డాకు మహారాజ్, మరో రెండు రోజుల తర్వాత జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతాయి. దీంతో ఇక తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 థియేట్రికల్ రన్ ఫినిష్ అయినట్టే. హిందీలోనూ భారీ స్థాయిలో అమాంతం కలెక్షన్లు పెరిగే ఛాన్స్ లేదు. దీంతో పుష్ప 2కు రూ.2వేల కోట్ల మార్క్ దాదాపు సాధ్యం కాదు. రూ.1,900 కోట్లు కూడా కష్టమే.

హిందీలో ఆల్‍టైమ్ రికార్డును పుష్ప 2 చిత్రం సాధించింది. తొలిసారి హిందీ నెట్‍ కలెక్షన్లలో రూ.800కోట్లు దక్కించుకున్న మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ చిత్రానికి కూడా ఇది సాధ్యం కాలేదు. హిందీలో ఆల్‍టైమ్ రికార్డును ఈ మూవీ క్రియేట్ చేసింది.

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా చేశారు. ఈ సీక్వెల్ మూవీని గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కించి మెప్పించారు దర్శకుడు సుకుమార్. ఈ మూవీలోని పాటలకు దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించారు సామ్ సీఎస్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకం నిర్మించింది. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, జగదీశ్ కీలకపాత్రలు చేయగా.. స్పెషల్ సాంగ్‍లో శ్రీలీల చిందేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం