Pushpa 2 box office collection: వసూళ్లలో పుష్ప 2 ఆల్‌టైమ్ రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ రప్పారప్పా
Pushpa 2 Day 1 collections: భారత సినీ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ ఇప్పటి వరకూ ఆర్ఆర్‌ఆర్ సినిమా పేరిట ఉండగా.. అల్లు అర్జున్ పుష్ప 2 ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసేసింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘పుష్ప 2: ది రూల్’ మూవీ డిసెంబరు 5 (గురువారం) థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో.. ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ తొలిరోజే రూ.294 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధికారికంగా పోస్టర్ ద్వాారా ప్రకటించింది. దాంతో భారత సినీ చరిత్రలో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచింది.
టికెట్ల అమ్మకాల్లోనూ రికార్డ్
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ కూడా నటించారు. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలవగా.. నిన్న వచ్చిన సీక్వెల్‌కి కూడా అన్ని భాషల్లోనూ ఆదరణ దక్కుతోంది. ఎంతలా అంటే.. తొలిరోజే ఏకంగా బుక్ మై షో ద్వారా 1.6 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఈ తరహాలో టికెట్లు అమ్ముడుపోలేదట.
ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్ బ్రేక్
భారత్‌లో తొలి రోజు రూ .209.2 కోట్ల గ్రాస్ రాబట్టిన పుష్ప 2.. ఓవర్సీస్‌లో రూ.70 కోట్లు వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ రూ.294 కోట్లని పుష్ప 2 వసూలు చేసింది. ఇప్పటి వరకూ ఓపెనింగ్ డేలో అత్యధిక వసూళ్ల రికార్డ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఉంది. ఆ మూవీ వరల్డ్ వైడ్ అప్పట్లో రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ను బద్దలుకొట్టిన పుష్ప 2.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
హిందీలోనూ పుష్ప డామినేట్
పుష్ప 2కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈసారి హిందీలోనూ మంచి వసూళ్లు వచ్చాయి. దాంతో తెలుగు, హిందీ భాషల్లో ఒకే రోజు రూ .50 కోట్లకు పైగా నెట్‌ను రాబట్టిన మొదటి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. రిలీజైన రెండో రోజు అంటే.. శుక్రవారం ముగిసే నాటికి పుష్ప కలెక్షన్లు రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.