Pushpa 2 Artists Injured: పుష్ప 2 యూనిట్‌కు ప్రమాదం - బస్ యాక్సిడెంట్‌లో ఆర్టిస్టులకు గాయాలు
Pushpa 2 Actors Bus Accident: పుష్ప-2 యాక్టర్స్ ప్రయాణిస్తోన్న బస్ నార్కట్‌పల్లి వద్ద ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఈ యాక్సిడెంట్‌లో పలువురు నటులు గాయపడ్డట్టు సమాచారం.
Pushpa 2 Actors Bus Accident: పుష్ప 2 ఆర్టిస్టులు ప్రయాణిస్తోన్న బస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు నటులు గాయపడినట్లు సమాచారం. పుష్ప -2 షూటింగ్‌ను పూర్తిచేసుకున్న కొందరు నటీనటులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్‌లో బయలుదేరినట్లు తెలిసింది. నార్కట్ పల్లి వద్ద వీరు ప్రయాణిస్తోన్న బస్‌ను మరో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్ బలంగా ఢీకొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ ప్రమాదంలో పలువురు నటులకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. గాయపడ్డ నటీనటుల్ని పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారని అంటున్నారు. ఈ యాక్సిడెంట్ కారణంగా హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలిసింది. బస్ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తోన్నారు.
ఈ బస్ ప్రమాదం ఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా పుష్ప -2 తాజా షెడ్యూల్ మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. . అల్లు అర్జున్‌తో (Allu Arjun) పాటు ప్రధాన తారాగణంపై సుకుమార్(Sukumar) కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుచెబుతోన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పుష్ప-2 సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్నారు.
ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషిస్తోన్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప-2 మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.