Allu Arjun Wax Statue: కుటుంబంతో కలిసి దుబాయ్ బయలుదేరిన అల్లు అర్జున్.. స్పెషల్ ఈవెంట్ కోసం..
Allu Arjun Wax Statue - Madame Tussauds: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‍కు బయలుదేరారు. కుటుంబంతో కలిసి వెళ్లారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ పాపులర్ అయ్యారు. గ్లోబల్‍గానూ ఈ చిత్రం రీచ్ అయింది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత విపరీతంగా పెరిగిపోయింది. 2021లో వచ్చిన పుష్ప సినిమా తెలుగుతో పాటు హిందీ, విడుదలైన అన్ని భాషల్లో బంపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్, యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్నీ ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఆయనను ఇమిటేట్ చేశారు. పుష్పకు గాను ఉత్తమ నటుడిగా ఆయనకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ఆ మూవీకి సీక్వెల్‍గా పుష్ప 2: ది రూల్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. కాగా, అల్లు అర్జున్‍కు తాజాగా మరో గౌరవం దక్కుతోంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
దుబాయ్‍కు ఐకాన్ స్టార్
దుబాయ్‍లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం రెడీ అయింది. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ కుటుంబంతో పాటు నేడు (మార్చి 25) దుబాయ్‍కు బయలుదేరారు.
అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ కలిసి నేడు హైదరాబాద్ నుంచి దుబాయ్‍కు పయనమయ్యారు. బ్లాక్ టీ షర్ట్, ప్యాంట్, బ్లాక్ క్యాప్ ధరించి ఐకాన్ స్టార్ మరింత స్టైలిష్‍గా కనిపించారు. అయాన్, అర్హ కూడా బ్లాక్ ఔట్‍ఫిట్స్ ధరించారు.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే విశాఖపట్టణం షెడ్యూల్‍లో పూర్తయింది. దాదాపు ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరింది. త్వరలోనే మరో షెడ్యూల్ మొదలుకానుంది. ఆగస్టు 15వ తేదీన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే చెప్పేసింది. ఆ రోజునే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
పుష్ప 2: ది రూల్ చిత్రాన్ని భారీ యాక్షన్ సీక్వెన్సులతో గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. హైప్ విపరీతంగా ఉండటంతో అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పర్‌ఫెక్ట్ ఔట్‍పుట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లిగా నటిస్తున్న రష్మిక మందన్నా లుక్ షూటింగ్ స్పాట్ నుంచి ఇటీవల లీక్ అయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. మిరొస్లా క్రుబా బోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇటీవల ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా కోసం విదేశాల్లో ఏ ఛేజింగ్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారని, అందుకోసమే ఆయన ఈ లైసెన్స్ కోసం అప్లై చేశారన్న బజ్ కూడా నడుస్తోంది. ఇంకా విదేశాలతో పాటు హైదరాబాద్‍లోనూ ఈ చిత్రం కోసం కొంత షూటింగ్ జరగనుందని టాక్.
టాపిక్