పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ సివిల్ ఇంజినీర్ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడంలో చక్రవ్యూహ పేరుతో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో సివిల్ ఇంజినీర్ పేరుతో డబ్ చేశారు. 2016లో కన్నడంలో రిలీజైన ఈ మూవీని 2022లో తెలుగులో థియేటర్లలో విడుదలచేశారు. తాజాగా యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది.
సివిల్ ఇంజినీర్ మూవీలో రచితా రామ్ హీరోయిన్‌గా నటించింది. అరుణ్ విజయ్ విలన్‌గా కనిపించాడు.
ఎమ్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ కోసం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సింగర్‌గా అవతారం ఎత్తాడు. కన్నడంలో గెలయా గెలయా అనే పాటను పాడాడు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి మరో కన్నడ అగ్ర హీరో సుదీప్ వాయిస్ ఓవర్ అందించారు.
కన్నడంలో థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే ఈ మూవీ ప్రాఫిట్స్ సొంతం చేసుకున్నది. ఈ మూవీ థియేట్రికల్ హక్కులు 14 కోట్లకు అమ్ముడు పోవడం అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పునీత్ రాజ్‌కుమార్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
లోహిత్ ఓ ఆర్కిటెక్ట్. గవర్నమెంట్ లా కాలేజీ స్టూడెంట్స్ మినిస్టర్ సదాశివయ్య మనుషులు దాడిచేస్తారు. ఈ గొడవలో ఓ స్టూడెంట్ చనిపోతాడు. సదాశివయ్య ప్లాన్ గురించి తెలుసుకున్న లోహిత్ అతడి అక్రమాలకు చెక్ పెట్టాలని అనుకుంటాడు. లోహిత్‌పై ఓంకార్ అనే రౌడీ పగను పెంచుకుంటాడు. మినిస్టర్‌కు ఓంకార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? లోహిత్ పోరాటంలో అంజలి అతడికి ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ మూవీ కథ.
కన్నడంలో అగ్ర హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ 2021లో గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశాడు.
సంబంధిత కథనం
టాపిక్