Pulimada OTT Release Date: ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళ థ్రిల్లర్ పులిమడ.. ఈ సినిమా ఎందుకు చూడాలంటే?-pulimada ott release date this malayalam thriller to release in netflix on november 23rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pulimada Ott Release Date This Malayalam Thriller To Release In Netflix On November 23rd

Pulimada OTT Release Date: ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళ థ్రిల్లర్ పులిమడ.. ఈ సినిమా ఎందుకు చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Nov 21, 2023 02:17 PM IST

Pulimada OTT Release Date: మరో మలయాళ థ్రిల్లర్ మూవీ పులిమడ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూలు చేయకపోయినా.. మంచి రివ్యూలు వచ్చాయి.

పులిమడ మూవీలో జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్
పులిమడ మూవీలో జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్

Pulimada OTT Release Date: ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ తోపాటు వాళ్ల కథ చెప్పే విధానం కూడా ఇక్కడి ఆడియెన్స్ కు తెగ నచ్చేస్తోంది. అలాంటి ప్రేక్షకులను అలరించడానికి తాజాగా మరో మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సినిమా పేరు పులిమడ. మలయాళ హీరో జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు గురువారం (నవంబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఏకే సజన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విన్సెంట్ స్కారియా (జోజు) అనే 40 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది.

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడంతోపాటు తన కాబోయే భార్య (ఐశ్వర్య రాజేష్) బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోవడంతో విన్సెంట్ జీవితం తిరగబడుతుంది. తన పెళ్లి జరగలేదన్న బాధ విన్సెంట్ ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. పులిమడ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ప్రేక్షకులను కట్టిపడేసే సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు.

ముఖ్యంగా విన్సెంట్ స్కారియాగా జోజు జార్జ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అటు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మాహిష్మతిగా నటించింది. పులిమడలోని ఈ లీడ్ క్యారెక్టర్లు సినిమా అంతా ఎంతో ఆసక్తి రేపేలా ఉంటాయి.

ఇక సినిమాటోగ్రఫీ. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ పులిమడ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వేణు వ్యవహరించగా.. జీతూ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నాడు. స్క్రిప్ట్ లో అక్కడక్కడా లోపాలు కనిపించినా.. సాంకేతిక బృందం పనితీరు ఈ సినిమాను కచ్చితంగా చూసే విధంగా మలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కట్టిపడేసేలా ఉంటాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.