Telugu News  /  Entertainment  /  Pspk With Nbk Unstoppable With Nbk2 Pawan Kalyan Episode First Glimpse Out Now
బాలయ్యతో పవన్
బాలయ్యతో పవన్ (Aha Twitter)

PSPK with NBK First Glimpse : బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోలో పవన్.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల

15 January 2023, 12:05 ISTAnand Sai
15 January 2023, 12:05 IST

PSPK with NBK First Glimpse : పండగపూట పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. Unstoppablewithnbk2 పవన్‌ ఎపిసోడ్‌ ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయ్యాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan).. బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షో(Unstoppable Show)లో సందడి చేయనున్నాడు. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే పండగ పూట అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఆహాలో బాలయ్యతో పవన్ షో గురించి అప్డేడ్ ఇచ్చారు. ఈ మేరకు షోకు సంబంధించి.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మెుట్టమెుదటిసారిగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఓ ఓటీటీ(OTT) షోలో పాల్గొన్నారు. బాలకృష్ణ(Bala Krishna) హోస్ట్ గా రన్‌ అవుతున్న `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` షోకి రావడంతో భారీ అంచనాలు పెరిగాయి. కిందటి నెలలోనే పవన్‌ ఎపిసోడ్‌(Pawan Episode) షూటింగ్ చేశారు. బాలయ్య, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మధ్య జరిగిన సంభాషణ ఏమై ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

పండుగ సందర్భంగా పవన్‌ ఎపిసోడ్‌ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టుగా ఆహా ప్రకటించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు పవన్‌ కల్యాణ్‌ `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే 2` ఎపిసోడ్‌ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది. ఎన్బీకే వర్సెస్‌ పవన్‌ కల్యాణ్‌ నడుమ జరిగే ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామని ఆహా తెలిపింది. చెప్పినట్టుగానే ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయ్యాయి.

తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సూపర్ గా ఉన్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో పవన్(PSPK With NBK) మాటలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మెజర్ మెంట్స్ కూడా తీసుకోవాలని బాలయ్య అనగా.. పవన్ కల్యాణ్ నవ్వడం తాజాగా విడుదలైన వీడియోలో కనిపిస్తోంది.

బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా రన్ అవుతున్న అన్ స్టాపబుల్ షో మెుదటి సీజన్ సక్సెస్ అయింది. టాక్‌ షోలకు అమ్మ మొగుడైందని బాలయ్య చెబుతుంటారు. ఇక రెండో సీజన్ కూడా అంతకుమించి డిజైన్ చేశారు. మెుదట మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌, అలాగే మరో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభాస్‌,గోపీచంద్‌, జయసుధ, జయప్రదలాంటి వారు వచ్చారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.