Propose Day 2025: తెలుగు సినిమాల్లో 5 బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్లు.. ఓయ్ నుంచి జాతిరత్నాలు వరకు..-propose day 2025 special 5 best love proposal scenes in telugu films and their ott streaming platforms ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Propose Day 2025: తెలుగు సినిమాల్లో 5 బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్లు.. ఓయ్ నుంచి జాతిరత్నాలు వరకు..

Propose Day 2025: తెలుగు సినిమాల్లో 5 బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్లు.. ఓయ్ నుంచి జాతిరత్నాలు వరకు..

Propose Day 2025: చాలా తెలుగు చిత్రాల్లో లవ్ ప్రపోజల్ సీన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో ఐదు బెస్ట్ సీన్లు ఇక్కడ తెలుసుకోండి. నేడు ప్రపోజ్ డే సందర్భంగా..

Propose Day 2025: తెలుగు సినిమాల్లో 5 బెస్ట్ లవ్ ప్రపోజ్ సీన్లు.. ఓయ్ నుంచి జాతిరత్నాలు వరకు..

ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఈ వీక్‍లో నేడు (ఫిబ్రవరి 8) ప్రపోజ్ డే. అంటే ప్రేమను వ్యక్తపరుచుకునేందుకు ఈ రోజు ప్రత్యేకం. చాలా తెలుగు లవ్ చిత్రాల్లో ప్రపోజల్ సీన్లు చాలా ఫేమస్ అయ్యాయి. ఎన్నో సీన్లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఎమోషనల్‍గా, క్యూట్‍గా, రొమాంటి‍క్‍గా అనిపించాయి. ఎన్నో సినిమాల్లోని ప్రపోజల్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. వాటిలో ఐదు ఇవి..

ఓయ్

సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఓయ్’ (2009) కమర్షియల్‍గా భారీ సక్సెస్ సాధించకపోయినా.. లవ్ చిత్రాల్లో ఓ క్లాసిక్‍గా పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో ఉదయ్ (సిద్ధార్థ్).. సంధ్య (షామిలీ)కి లవ్ ప్రపోజ్ చేసే సీన్ ఎంతగానో ఆకట్టుకుంది. సంధ్య పుట్టిన రోజున 12 బహుమతులను ఇస్తూ.. వాటి ప్రత్యేకతలను వివరిస్తూ ఉదయ్ తన ప్రేమను చెప్పే సీన్ అద్భుతంగా సాగుతుంది. క్యూట్‍గా, ఎమోషనల్‍గా మనసులు తాకేలా ఉంటుంది. తెలుగు చిత్రాల్లో ఇది ఒకానొక బెస్ట్ ప్రపోజల్ సీన్‍గా నిలిచిపోయింది. ఓయ్ మూవీకి ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. ఓయ్ మూవీ సన్‍నెక్స్ట్ ఓటీటీతో పాటు యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.

మిర్చి

ప్రభాస్, అనుష్క శెట్టి జంటగా నటించిన మిర్చి (2013) చిత్రంలోనూ లవ్ ప్రపోజల్ సీన్ ఐకానిక్‍గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీలో ఈ సీక్వెన్స్ ఎమోషనల్‍గా టచ్ చేస్తుంది. వెన్నెల (అనుష్క)లోని ప్రత్యేకమైన గుణాలను కుటుంబానికి వివరిస్తాడు జై (ప్రభాస్). “ఒక్క ఛాన్స్ ఇస్తావా.. జీవితాంతం ఇక్కడ పెట్టి చూసుకుంటాను” అంటూ గుండెపై వేలు చూపిస్తూ వెన్నెలకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. అప్పటికే జైపై ప్రేమను దాచుకొని ఉన్న వెన్నెల కన్నీళ్లతో ఓకే చెప్పేస్తుంది. ఈ సీన్ ఏడిపిస్తూనే సంతోషం కలిగిస్తుంది. మిర్చి మూవీని డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీతో పాటు యూట్యూబ్‍లోనూ చూడొచ్చు.

ఏ మాయ చేశావే

ఏ మాయ చేశావే (2010) సినిమాలోని ప్రపోజల్ సీన్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే. ఒక్క నువ్వు తప్ప” అని కార్తీక్ (నాగచైతన్య) అంటే.. ఎందుకలా అని జెస్సీ (సమంత) అడుగుతుంది. ఎందుకంటే నేను నీతో ప్రేమలో ఉన్నా జెస్సీ అంటూ చెప్పేస్తాడు కార్తీక్. నడుచుకుంటూనే క్యూట్‍గా, హఠాత్తుగా మాటల్లోనే ప్రపోజ్ చేసేస్తాడు. వీరిద్దరి మధ్యయ కేరళలో సాగే మరో ప్రపోజల్ సీన్ కూడా ఆకట్టుకుంది. ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యాజిక్ ఈ సీన్లకు మరింత మంచి ఫీల్ తీసుకొచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ, యూట్యూబ్‍లో స్ట్రీమింగ్‍కు ఉంది.

ఊహలు గుసగుసలాడే

నాగశౌర్య, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఊహలు గుసగుసలాడే (2014) సినిమాలో ప్రపోజల్ సీన్ ఫన్నీగా అదిరిపోతుంది. టీవీలో లైవ్ వాతావరణ వార్తల్లో వెంకటేశ్వరరావు అలియాజ్ వెంకీ (నాగశౌర్య), ప్రభ (రాశి ఖన్నా) మధ్య ఈ సీన్ ఆకట్టుకుంటుంది. అంతకు ముందు ప్రభకు వెంకీ ప్రపోజ్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ప్లాట్‍ఫామ్‍ల్లో చూడొచ్చు.

జాతిరత్నాలు

డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు (2021).. కామెడీ సినిమానే అయినా లవ్ ప్రపోజల్ సీన్ గుర్తుండిపోతుంది. నవీన్ పోలిశెట్టి, పారియా అబ్దుల్లా మధ్య ఉండే ఈ సీన్ క్యూట్‍గా ఉంటుంది. నీకో విషయం చెప్పాలంటున్నా.. ఏమీ అనుకోవద్దు అంటున్నా.. నా మనసులో ఏముందో నీకు అర్థమవడం లేదా అని శ్రీకాంత్ (నవీన్).. చిట్టీ (ఫారియా)కు చెబుతాడు. ఐ లవ్ యూ చెప్పకుండానే ప్రపోజల్ పెట్టేస్తాడు. నువ్వు ఇన్నిసార్లు తడబడుతున్నా.. చెప్పు ఏమీ అనుకోను అంటున్నా.. నా మనసులో ఏముందో అర్థం అవట్లేదా అంటూ చిట్టీ కూడా చెప్పిచెప్పనట్టుగానే ఓకే అంటుంది. ఈ సీన్ కూడా ఐకానిక్‍గా నిలిచింది. జాతిరత్నాలు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సంబంధిత కథనం