Telugu OTT Releases:ఈ వారం డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన మూడు తెలుగు సినిమాలు గురువారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కామెడీ, మర్డర్ మిస్టరీ తో పాటు పొలిటిలక్ సెటైరికల్ జానర్ లలో తెరకెక్కిన ఈ సినిమాలు ఓటీటీ ఫ్యాన్స్‌ను అలరించబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఆహా ఓటీటీలో మే 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. కానీ ఒకరోజు ముందగానే ఫ్యాన్స్ కోసం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ విలన్‌గా నటించాడు. తమిళ మూవీ మాయవన్‌కు డబ్ వెర్షన్ ప్రాజెక్ట్ జెడ్ ఇటీవలథియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మనిషి మెదడును మరో మనిషిలోకి కాపీ చేస్తూ వరుస హత్యలకు పాల్పడుతోన్న ఓ సెంటిస్ట్‌ను కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? ఈ హత్యల వెనకున్న మిస్టరీని కుమార్ ఎలా ఛేదించాడు? ఈ ప్రయోగం వెనుక ఉన్నది ఎవరనే కథాంశంతో ప్రాజెక్ట్‌జెడ్ మూవీ రూపొందింది. ప్రాజెక్ట్ జెడ్ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహించాడు.
రజిషా విజయన్ హీరోయిన్‌గా నటించిన కీచురాళ్ళు మూవీ గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సైబర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ రిజీ నాయర్ దర్శకత్వం వహించాడు. శ్రీనివాసన్, విజయ్ బాబు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు ... మలయాళంలో హిట్టైన కీడం మూవీకి డబ్ వెర్షన్‌గా కీచురాళ్ళు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
రాధికా బాలన్ (రజిషా విజయన్) ఓ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కంపెనీని రన్ చేస్తుంటుంది. అనుకోకుండానే సైబర్ క్రైమ్ బాధితురాలిగా రాధిక మారిపోతుంది. ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తుంటాడు? అతడు ఎవరు? అదృశ్య వ్యక్తిని తన తెలివితేటలతో రాధిక ఎలా పట్టుకుంది? అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రామన్న యూత్ ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం రిలీజైంది. పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్‌తో అభయ్ బేతిగంటి రామన్న యూత్ మూవీని తెరకెక్కించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో అమూల్యరెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అనీల్ గీలా ప్రధాన పాత్రలు పోషించారు.
పొలిటికల్ లీడర్ కావాలని కలలు కంటాడు రాజు(అభయ్ బేతిగంటి).తమ నియోజకవర్గ. ఎమ్మెల్యేపై అభిమానంతో అతడి పేరు మీద రామన్న యూత్ అసోసియేషన్‌ను ఏర్పాటుచేస్తాడు. ఊరిలో దసరా పండుగ సందర్భంగా పెద్ద ఫ్లెక్సీ పెట్టిస్తాడు రాజు. ఆ ఫ్లెక్సీ సాఫీగా సాగిపోతున్న రాజు జీవితంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది. అతడు ఎందుకు జైలుపాలయ్యాడు? అనే కాన్సెప్ట్‌తో రామన్న యూత్ మూవీ రూపొందింది.
ఈ మూడు సినిమాలతో పాటు అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ కూడా శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
టాపిక్