Project k Release Date: ప్రాజెక్ట్ కే రిలీజ్‌డేట్ ఫిక్స్ - సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్‌-project k movie release date announced prabhas movie to hit the big screens on sankranthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Project K Movie Release Date Announced Prabhas Movie To Hit The Big Screens On Sankranthi

Project k Release Date: ప్రాజెక్ట్ కే రిలీజ్‌డేట్ ఫిక్స్ - సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 18, 2023 11:30 AM IST

Project k Release Date: ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ డేట్‌ను శ‌నివారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌క‌లు ముందుకు రానుందంటే...

ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే
ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే

Project k Release Date: ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టిస్తోన్న ప్రాజెక్ట్ కే (Project k) రిలీజ్ డేట్‌ను మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శ‌నివారం అనౌన్స్‌చేశారు. సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో భారీ ఆకారంలో ఉన్న చేతిపై కొంద‌రు గ‌న్స్ గురిపెడుతూ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

సూప‌ర్ హీరో క‌థాంశంతో ప్రాజెక్ట్ కే సినిమా తెర‌కెక్కుతోంది. త‌న‌కున్న ప‌వ‌ర్స్‌తో దుష్ట శ‌క్తుల‌పై ఓ సూప‌ర్ హీరో ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ అని స‌మాచారం. మ‌హాన‌టి త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తోన్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా ప్రాజెక్ట్ కే సినిమా తెర‌కెక్కుతోంది. తొలుత ఈ సినిమాను 2023 ఆక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ అదే స‌మ‌యంలో ప్ర‌భాస్ స‌లార్ రిలీజ్ కానుండ‌టంతో సంక్రాంతికి ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.