Arjun Son Of Vyjayanthi Producers About Jr NTR Response: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.
ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
-కల్యాణ్ రామ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాం. ఆయన ఎక్స్‌పరిమెంటల్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఆయనతో చేయాలని ఈ కథని సిద్ధం చేయించాం. కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కల్యాణ్ రామ్ గారి కోసం తయారుచేసినవే. మదర్ క్యారెక్టర్‌ను విజయశాంతి గారు చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. అన్ని ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది. మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్.
-ప్రదీప్ గారితో నేనొక వెబ్ ఫిల్మ్ చేశాను. ఆయనతో నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అయినా కమర్షియల్ మీటర్ తెలిసిన డైరెక్టర్. ఈ కథకు ఆయన బెటర్ అనిపించింది. హై ఎమోషన్ ఉన్న ఈ సినిమాని ఆయన అద్భుతంగా తీశారు.
-అలా ఎలా సినిమా నా ఫ్రెండ్ అనీస్ కోసం చేశాను. అందులో సునీల్ కూడా ఉన్నారు. ఆ సినిమాని సునీల్‌నే ప్రమోట్ చేశారు. కల్యాణ్ గారు నా ఫ్రెండ్. అందరం కలసి ఒక సినిమా చేద్దామని ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
-లేడీ పోలీస్ ఆఫీసర్ అనగానే విజయశాంతి గారే గుర్తుకు వస్తారు. కర్తవ్యం సినిమా స్ఫూర్తితో తీర్చిదిద్దిన పాత్రలో కనిపిస్తారు. ఈ కథని ఆమె ఓకే చేస్తారని మాకు గట్టి నమ్మకం. మా నమ్మకం ప్రకారం ఈ సినిమాని ఆమె ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో చాలా పవర్‌ఫుల్ రోల్ చేశారు.
-సినిమా ఫస్ట్ చూసింది జూనియర్ ఎన్టీఆర్ గారే. ఆయన చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఎమోషనల్ యాక్షన్ బెస్ట్ ఉందని చెప్పారు. రికార్డింగ్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా చూకోమని చెప్పారు. అజీనిష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ గారు చెప్పినట్లు చివరి ఇరవై నిముషాలు కళ్లు చెమ్మగిల్లెలా ఉంటుంది. ఇలా రావడానికి కారణం సినిమా బిగినింగ్ నుంచి బిల్డ్ చేసిన ఎమోషన్. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.
సంబంధిత కథనం