Producer Y Ravi Shankar About Robinhood Ticket Prices: తెలుగులో హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్స్‌గా జంటగా తొలిసారి కలిసి నటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించారు.
రాబిన్‌హుడ్ సినిమాలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన రాబిన్‌హుడ్ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు నితిన్, డైరెక్టర్, నిర్మాత వై రవిశంకర్ ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పారు.
-నా క్యారెక్టర్ ఇందులో వెరీ బిగ్ మానిప్యులేటర్. చాలా స్మార్ట్ మైండ్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్టులు, షాకులు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. భీష్మ సినిమాలో కంటే నా క్యారెక్టర్ వెరీ స్ట్రీట్ స్మార్ట్‌గా ఉంటుంది. వెరీ ఇంటలెక్చువల్ క్యారెక్టర్.
-సినిమా అంతా షుగర్ కోట్ లాగా ఫన్ కొటెడ్‌గా ఉంటుంది. కానీ, సినిమాలలో సోల్ ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది మీరు బిగ్ స్క్రీన్‌లోనే చూడాలి. ఇప్పటివరకు చూసినవారు చాలా అద్భుతంగా ఉందని చెప్పారు
-ఇందులో ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని ఆ పాత్రకు వార్నర్ అనుకున్నా. నిర్మాత రవి గారు చాలా సీరియస్‌గా ట్రై చేసి మీటింగ్ అరేంజ్ చేశారు. నేను ఇచ్చిన నెరేషన్ ఆయనకు నచ్చి అంగీకరీంచారు.
-ఇందులో ఆస్ట్రేలియా ఎపిసోడ్ ఉంది. వార్నర్ క్యామియో అక్కడే షూట్ చేశాం. అది మీరు థియేటర్‌లో చూసినప్పుడే మ్యాజిక్‌గా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చెప్తే సర్‌ప్రైజ్ మిస్ అవుతుంది. థియేటర్స్‌లో చూసినప్పుడు కచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
-ఏం లేదండి . 95% పాత రేట్లే ఉన్నాయి. ఐదు శాతం అది కూడా కొన్ని మాల్స్‌లో మాత్రమే స్మాల్ చేంజ్ ఉంటుంది. అది కూడా ఎఫర్టబుల్‌గానే ఉంటుంది. టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదనే ఫీలింగు ఎక్కడ ఉండదు.
సంబంధిత కథనం